kiran24x7news:
గూడూరు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటిగా పట్టణంలోని బస్టాండ్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా వైసిపి టిడిపి సిపిఎం మరియు ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన కులహక్కులు కల్పించారని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ జూలపాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్అస్లాం టిడిపి నాయకులు దండు సుందరరాజు మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు సృజన్ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సుబాకర్ మణిరాజు, సిపిఎం నాయకులు మోహన్ రామన్న బజారి తిక్కయ్య మరియు స్థానిక నాయకులు నేతలు పాల్గొన్నారు.






