kiran24x7news:

ఏఐటీయూసీ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ లో పనిచేస్తున్న కామ్రేడ్ నారాయణ నిన్న అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం వల్ల సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు ఆవుల శేఖర్ నాయకులుఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు ఎస్ మునియప్ప కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మురళీకృష్ణ గారు పాల్గొని వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీలో ఎం నారాయణ గారు ఎంతో కృషి చేశారని వారు కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని వారు కోరారు.ఈ సందర్భంగా వారు నారాయణ ఆశయాలను సాధిస్తామని జోహార్ కామ్రేడ్ నారాయణ అంటూ నినాదాలు చేస్తూ ఆయన అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఏఐటీయూసీ ప్రజాసంఘాల నాయకులు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు హమాలి సంఘం నాయకులు మహిళా సంఘం నాయకులు అనేకమంది నాయకులు కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.

మరియు నారాయణమూర్తి కార్యక్రమంలో సిపిఐ వార్డ్ మెంబర్ రాజేశ్వరి మహిళా సమైక్య నాయకురాలు సులోచనమ్మ లక్ష్మీదేవి నాగలక్ష్మి గుప్తా నగర్ కాలనీవాసులు రాముడు తదితరులు పాల్గొన్నారు.