గూడూరు,జూన్13,( కిరణ్24×7న్యూస్).కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారణగా కర్నులు జిల్లా క్రీడల అభివృద్ది అధికారి బి . భూపతిరావు మరియు డి. ఏస్. ఏ. సిబ్బందితో కలిసి గూడూరు పట్టణంలోని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కే.వి.కె స్టేడియం మరియు స్టేడియం కు సంబంధించిన దుకాణాలను వారు తనిఖీ చేయడం జరిగినది. షాపు రెంట్లు చెల్లించకుండా వేలంపాట దారులు నిర్లక్ష్యం వహించడంతో వారితో స్వయంగా మాట్లాడి బకాయిలను వెంటనే చెల్లించాలంటూ వారికి మెమోలు అందించి ఆదేశించారు . స్టేడియంలోని షటిల్ కోర్టు మరియు వ్యాయామశాలను పరిశీలించారు స్టేడియం కు సంబంధించి నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.






