గూడూరు,జూన్13,( కిరణ్24×7న్యూస్)
గూడూరు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ నందు పాఠశాల ప్రారంభ వేడుకలను పాఠశాల చైర్మన్ ఎల్. వెంకటేశ్వర్లు, పాఠశాల కరస్పాండెంట్ జిలాని మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు.పాఠశాలకు వచ్చే విద్యార్థులకు వారు ఘన స్వాగతం పలికారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులంతా కలిసి కేక్ కట్ చేసి పాఠశాల ప్రారంభ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎస్ఏ జిలాని మాట్లాడుతూ గత విద్య సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులందరికీ పాఠశాల ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాధిక మరియు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.






