కిరణ్24×7న్యూస్; గూడూరు (జూన్, 24) కోడుమూరు నియోజవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన బొగ్గుల దస్తగిరిని సోమవారం గూడూరు పట్టణానికి చెందిన టిడిపి నాయకులు ఆయన నివాసంలో కలిసి పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కోడుమూరు నియోజకవర్గంలోని వైసిపి కంచుకోటను బద్దలు కొట్టి టిడిపి జెండాను ఎగురవేసి అఖండఖ్యాతిని పార్టీకి తీసుకువచ్చిన ఎమ్మెల్యే దస్తగిరికి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. టిడిపి నేతల అభ్యర్థనలకు కోడుమూరు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దండు సుందర్రాజు, నాయకులు గిడ్డయ్య చంటి ఇస్సాక్ కళ్యాణ్ రఘు యేసేపు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






