కిరణ్24×7న్యూస్, గూడూరు (జూన్,24) రక్షా హాస్పిటల్ అధినేత అయిన నాగరాజు గారి జన్మదిన వేడుకలు సోమవారం అభిమానుల వేడుకల నడుమ ఘనంగా జరిగింది. అభిమానులు సంఘం నాయకులు అధిక సంఖ్యలో హాస్పిటల్ కు చేరుకుని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఆయనను పూల మాలలతో శాలువాలతో సత్కరించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో సేవలు చేశారని ఆయన ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ అభిమానులు సంఘం పెద్దలు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర కురువ యువజన సంఘం అధ్యక్షుడు బత్తిన కిరణ్ కుమార్ మరియు ఎల్లప్ప, తిరుమలేష్, మహానంది, లక్ష్మీపురం మురళీమోహన్, పెంచికలపాడు, ఎంపిటిసి మద్దిలేటి కర్ణం యుగంధర్, మహేష్, ,శివనారాయణ, వెంకటకృష్ణ, పురుషోత్తం, రంగస్వామి, తడకనపల్లె లాలు, ఆర్టీసీ నారాయణ, మదేస్, నాగేష్, అభిమానులు పాల్గొన్నారు.






