కిరణ్24×7న్యూస్,( జూన్, 1 ) గూడూరు నగర పంచాయతీ ఎస్సీ కాలనీ మూడో వార్డు నందు గత కొన్ని రోజులుగా బోరు మోటర్ పనిచేయకపోవడంతో కాలనీ లో నీటి సమస్య నెలకొంది. మూడో వార్డు కౌన్సిలర్ నందకిషోర్ వైసిపి నాయకులు
దండు శ్రీను, కాలనీ ప్రజలు మున్సిపల్ చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు మరియు
వైస్ చైర్మన్ pn అస్లాం, కమిషనర్ దివాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో వారు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికిన మరమ్మతులు చేయించి నీటి సమస్యకు పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా చైర్మన్ జూలపాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణ పరిధిలోని ప్రతి కాలనీలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమస్య పరిష్కరించినందుకు 3వ వార్డు కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.






