కిరణ్24×7న్యూస్, (జూన్, 1).. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో సోమవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో  లబ్ధిదారులకు పింఛన్లను అందజేసిన టిడిపి పార్టీ మండల కన్వీనర్ ఎల్. సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందిస్తానని చెప్పి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదటి సంతకం 3000 రూపాయల పింఛన్లు 4000 రూపాయలు పెంచడం జరిగినది తెలిపారు. పింఛన్లను ఏప్రిల్ నెల నుంచి పెంచుతూ  మూడో నెలకి 3000 మరియు పెంచిన 4000 రూపాయలు కలిపి ఈరోజు లబ్ధిదారులకు 7000 రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా  లబ్ధిదారులు  హర్షం వ్యక్తం చేస్తూ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలచంద్రుడు వెంకట్రాముడు డాక్టర్ వెంకటేశ్వర్లు నాయుడు గిడ్డయ్య వెంకటేశ్వర్లు సుధాకర్ వీరన్న మరియు గ్రామ ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.