కిరణ్24×7న్యూస్, (జూన్, 1).. గూడూరు నగర పంచాయతీ పరిధిలో సోమవారం ఒకటవ వార్డు టిడిపి పార్టీ కౌన్సిలర్ బుడ్డంగలి, యూనిట్.39 ఇంచార్జ్ .చందు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బుడంగలి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందిస్తానని చెప్పి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదటి సంతకం 3000 రూపాయల పింఛన్లు 4000 రూపాయలు పెంచడం జరిగినది తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆయన కచ్చితంగా నెరవేరుస్తారని ప్రజలు అధైర్య పడవద్దు అని తెలిపారు. టిడిపి హయాంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






