కిరణ్24×7న్యూస్,(జూన్, 1)… గూడూరు నగర పంచాయతీలోని 9వ వార్డు పరిధిలో ఉన్న పడఖాన వీధిలోని వృద్ధులకు, వితంతువులకు,వికలాంగులకు సోమవారం వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు 9వ వార్డు కౌన్సిలర్ కోడుమూరు షాషావలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి,ఏఈ నరసింహులు, టీడీపీ పార్టీ నాయకులు డాక్టర్ మన్నాన్ బాష,ఖలీల్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు వీరి చేతుల మీదుగా పింఛన్లను అందజేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా 3 నెలల డబ్బులతో కలిపి 7000/- రూపాయలు లబ్ధిదారులకు అందజేయడంతో పెన్షన్ దారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.






