కిరణ్24×7న్యూస్,(జూలై,11)గూడూరు పట్టణం లోని నగరపంచాయతీ కార్యాలయం నందు గురువారం నగర పంచాయతీ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, కమిషనర్ దివాకర్ రెడ్డి అధ్యర్యంలో వైద్య సిబ్బంది నేతృత్వంలో ప్రపంచ జనాభా దినోత్సవం మరియు వర్షాకాలం దృష్ట్యా డయేరియా వ్యాధిపై తీసుకోవలసిన జాగ్రతలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.చైర్మన్ మరియు కమిషనర్ జెండా ఊపి అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాచి వడ పోసిన నీటిని మాత్రమే త్రాగవలేనని మరియు భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుగుకోవాలని వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఇంటి దగ్గర ప్రదేశములను పరిశుభ్రముగా వుంచుకొనవలెనని సూచించారు. కార్యక్రమంలో ఏఈ నరసింహులు,హెచ్ఇ కృష్ణారెడ్డి, వైద్య సిబ్బంది రాఘవయ్య, సచివాలయం సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ రవి, ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు,నగర పంచాయతీ సిబ్బంది,మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.






