కిరణ్ 24×7 న్యూస్;   రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా ఇంతకుమునుపు కర్నూల్ జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు నెల్లూరు జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో గరికపాటి బిందు మాధవ్ ఐపియస్ గారు కర్నూల్ జిల్లా ఎస్పీగా సోమవారం జల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన బిందుమాధవ్ ఐపియస్ గారిని కుటుంబ సమేతంగా పూరోహితులు ఆశీస్సులు అందజేశారు.

అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మిడియాతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు.

కర్నూలు జిల్లా ఎస్పీగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గారికి, ఆయన కృతజ్ఞతలు తెలిపారు.