కిరణ్24×7న్యూస్; గూడూరు నగర పంచాయతీ పరదిలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం ఆవరణలో చాలా రోజులుగా పారిశుద్ధ్యం సమస్య నెలకొని ఉండడంతో వసతి గృహం వార్డెన్ ఫిర్యాదు మేరకు నగర పంచాయతీ అధికారులు స్థానిక టిడిపి నాయకులు కౌన్సిలర్లు స్పందించి పారిశుద్ధం పనులను చేపట్టారు. బాలికల వసతి గృహం ఆవరణలో నిలిచి ఉన్న మురికి నీటిని డ్రైనేజీ కాలువకు మళ్లించేందుకుగాను జెసిబి వాహనంతో డ్రైనేజీ కాలువలో పూడికలను తీయించారు. మురికి నీటినంత డ్రైనేజీ కాలువకు మళ్ళించారు. దీంతో వసతిగృహం బాలికలు వార్డెన్ సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, ఏఈ నరసింహులు, మాజీ వైస్ చైర్మన్ కె. రామాంజనేయులు, పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులు కె.గజేంద్ర గోపాల్ నాయుడు, నగర పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ పుట్టపాశం రామాంజనేయులు, కౌన్సిలర్లు షాషావలి, బుడంగలి, మరియు నాయకులు రేమట వెంకటేష్, పౌలు,చందు, వార్డెన్ మాధవేనమ్మ తదితర నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.