కిరణ్24×7న్యూస్ ; గూడూరు పట్టణంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో మంగళవారం వైద్య సిబ్బందికి కుష్టు నివారణ పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని వైద్యాధికారులు ప్రత్యూష సోఫియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే నిర్వహించాలని వారు తెలిపారు. సదస్సులో వైద్య సిబ్బందికి వ్యాధి లక్షణాలను సర్వే లో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే అంశాలను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ రామకృష్ణ, హెచ్ఈ కృష్ణారెడ్డి, వైద్య సిబ్బంది రాఘవయ్య, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు.






