కిరణ్ 24×7 న్యూస్; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ మోడల్ స్కూల్ పాఠశాలల్లో ఆరవ తరగతి చేరేందుకు ప్రవేశాలకు ఈనెల 25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటనలో తెలిపినట్లుగా జూలకల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దిల్షాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దిల్షాద్ మాట్లాడుతూ ఓసి, బీసీలు రూ. 150, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రూ.75 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించనున్నట్లుగా తెలిపారు.ఏ మండలంలో పాఠశాల ఉంటే అక్కడే ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఐదో తరగతి స్థాయిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీన మెరిట్ జాబితా విడుదల చేస్తారని, ధ్రువపత్రాల పరిశీలన 30వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా పాఠశాల కరస్పాండెంట్ ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.