కిరణ్ 24×7 న్యూస్;
గూడూరు మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం పొందుటకు దరఖాస్తు తీసుకున్న దరఖాస్తుదారులకు సోమవారం గూడూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. గూడూరు మండలంలోని ఆయా గ్రామాల పరిధిలోని బ్యాంకు సిబ్బంది ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కు ఇంటర్వ్యూలను నిర్వహించి వారి సర్టిఫికెట్లను పరిశీలించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శివ నాగ ప్రసాద్ మాట్లాడుతూ గూడూరు మండలంలో ఆయా గ్రామాల నుండి బీసీ కార్పొరేషన్ రుణాల కొరకు 385 దరఖాస్తులు అందినట్లుగా తెలిపారు. గూడూరు మండలంలో మొత్తం 50 బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు దరఖాస్తుదారులను ఇంటర్వ్యూలు నిర్వహించి వారి సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం అర్హుల జాబితాను ప్రకటిస్తామని అన్నారు.






