చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్…
గూడూరు న్యూస్:
గూడూరు నగర పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో 4,6, వార్డులలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ , టిడిపి పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు మరియు టీసీ మెంబర్ చెట్టు కింద సురేష్ పాల్గొని ప్రతి తలుపును తడుతూ కూటమి ప్రభుత్వంలో ఏడాది కాలంలో ఇస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజల నుండి మంచి విశేష స్పందన తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది కాలం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేశారు, దీపం పథకం కింద ఉచితంగా మూడు సిలిండర్లను అందజేశారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు రాజధాని అమరావతిలో రాష్ట్ర అభివృద్ధి కొరకు కొన్ని వందల ఇండస్ట్రీస్ ను తీసుకొస్తూ రాష్ట్ర అభివృద్ధికి మరియు నిరుద్యోగ యువతకు దిక్సూచిగా నిలబడిన గొప్ప నాయకుడు చంద్రబాబు గారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని అన్నారు రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెట్టుకింద నారాయణ, వసంత్ గారి పెద్ద రంగడు, అయ్యవారి నాయుడు, తిక్కన్న గారి నాగరాజు, వాల్మీకి సంఘం కార్యదర్శి కొండమీది కేశవులు, బేతపల్లి మధు,సురేంద్ర, కట్టెల సుంకన్న, గుంటి రంగడు, రఘు బాబు ఎం జి బి యూత్ సభ్యులు నరసింహ సురేంద్ర సురేష్ పవన్ తదితరులు పాల్గొన్నారు.






