గూడూరు పట్టణంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం…
గూడూరు న్యూస్:
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం అనే లక్ష్యంతో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం గూడూరు పట్టణంలో ఘనంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,కర్నూలు జిల్లా డీసీసీబీ చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
గూడూరు పట్టణం 185వ బూత్ పరిధిలో తెలుగుదేశం పార్టీ గూడూరు పట్టణ కన్వీనర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కె. రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో సజావుగా సాగింది.
ఈ సందర్బంగా కె రామాంజనేయులు మాట్లాడుతూ
“సూపర్-6 పథకాలు” ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు.
ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో, గూడూరు పట్టణంలోని ఇతర వార్డుల్లో కూడా ఇదే తరహా కార్యక్రమాలను కొనసాగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రేమాట వెంకటేష్,కౌన్సిలర్ కోడుమూరు షాషావలి, కె. కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






