ఆలయ అభివృద్ధికై గ్రామ పెద్దలు ఆర్. చంద్రారెడ్డి దంపతుల విరాళం..

(కిరణ్ 24×7 న్యూస్) :గూడూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారానికి గ్రామ పెద్దలు ఆర్.చంద్రారెడ్డి ఆర్.అనంతమ్మ దంపతులు సహకారంతో ఆలయ అభివృద్ధికై భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.మంగళవారం ఆర్.చంద్రారెడ్డి దంపతులతో పాటు ఆర్.మల్లికార్జున రెడ్డి మాజీ సింగల్ విండో అధ్యక్షులు ఆర్.విజయ భాస్కర్ రెడ్డి ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి ఆర్. పద్మావతి ఆర్.కళ్యాణి కూతురు పి.శ్రీదేవి లతోపాటు పలువురు గ్రామస్తులు భూమి పూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు గ్రామ పెద్దలు ఆర్.చంద్రారెడ్డి మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగిందని అందులో భాగంగా ఆలయ ముఖద్వారం కుటుంబ సభ్యుల సహకారంతో ముఖద్వారా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరియు రాష్ట్రస్థాయి ఎద్దులు బండలాగుడు పోటీలు  గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.