చంద్రబాబూ..ఇకనైనా మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి..
కిరణ్ 24×7 న్యూస్:
రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్
గూడూరు మున్సిపాలిటీలో కోటి సంతకాల సేకరణ
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని, ప్రజల స్పందన చూసైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి , వైఎస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గూడురు మున్సిపాలిటీలో సంతకాలు పూర్తి చేసి పత్రాలు కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి , కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సతీష్‌కి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రజలకు హర్షవర్ధన్ రెడ్డిగారు, సతీష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో చేపట్టిన ఏ కార్యక్రమమైనా కోడుమూరు నియోజకవర్గంలో ఘనవిజయం సాధిస్తుందని,
ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సమన్వయంతో చేపట్టామన్నారు. ప్రజలు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేతుల్లోకి వెళితే పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు . అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలుపుతున్నారని ఆయన తెలిపారు. గ్రామ, మండల నాయకులు రోజూ కష్టపడి పనిచేయడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించారని హర్షవర్ధన్ రెడ్డి , డాక్టర్ సతీష్ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గూడూరు వైస్ చైర్మన్ కర్నూలు జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షులు అస్లాం, వైస్ చైర్మన్ లక్ష్మన్న, కో ఆప్షన్ నెంబర్ మదర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ హబీబ్, రవి ప్రతాప్, పత్తి రంగడు, కొండగేరి గిడ్డయ్య, శివ, మధు, పుట్టే పాశం గిరి, పెద్ద గిడ్డయ్య, ముజీబ్, రషీద్, సుధాకర్, బొంబాయి వీరేష్, సింగనగేరి శీను, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






