గూడూరులో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది హిందూ సమ్మేళనం…

కిరణ్ 24×7 న్యూస్:

రాజకీయ–కుల భేదాలకు అతీతంగా 5,000 మందితో చారిత్రాత్మక సభ..

గూడూరు పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు, కులాలకు అతీతంగా దాదాపు 5,000 మంది హిందువులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడం గూడూరు చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా నిలిచింది.

ఈ సమ్మేళనానికి చిన్మయ మిషన్‌కు చెందిన పూజ్య మాతాజీ సుప్రేమానంద సరస్వతి, లలితా పీఠం పీఠాధిపతి శ్రీ మేడ సుభ్రమణ్య స్వామి , హనుమాన్ జంక్షన్ వ్యవస్థాపకులు గురు స్వామి రామాంజనేయులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. RSS దక్షిణ భారతదేశ ప్రముఖ్ శ్రీ భరత్ జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో మారెమ్మ గుడిలో ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. అనంతరం స్వామీజీలు, భక్తులు కలిసి పాదయాత్రగా సభా ప్రాంగణమైన తిమ్మగురుడు స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఈ పాదయాత్రలో చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సభలో స్వామీజీలు మాట్లాడుతూ, ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడులపై సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అలాగే ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలం, ఐక్యతకు మూలమని పిలుపునిచ్చారు.ప్రతి తల్లి తమ పిల్లలను ఛత్రపతి శివాజీ లాగా పెంచాలని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగమైన వివిధ కుల సంఘాల పెద్దలకు, భజన మండళ్లకు స్వామీజీల చేతుల మీదుగా సన్మాన సత్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డమం సురేష్, “ఇంత పెద్ద సంఖ్యలో హిందువులు ఐక్యంగా పాల్గొనడం గూడూరు చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాజేష్, మల్లేష్ నాయుడు, పొన్నకల్ వెంకటేష్, శంకర్, రాము, ఆనంద్, భీమేష్, క్రిష్ణ, వీరన్న, తారక్, శివరాముడు,విగ్నేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొని కార్యక్రమ విజయానికి విశేషంగా తోడ్పడ్డారు.