ప్రజలు స్వేచ్ఛగా , నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి…
కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు.
ఎదురూరు గ్రామంలో కేంద్ర సాయుధ బలగాల కవాతు..
కవాతు మరియు ఓటర్ల అవగాహన ర్యాలీ లో పాల్గొన్న …జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఐఏయస్ గారు , జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్ గారు.
• ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే పోలీసుల కవాతు….
• ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.
• జిల్లాలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు.
ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు మంగళవారం తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు తెలిపారు.
ఈ రోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు
జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్” సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు.
కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలోని ఎదురూరు గ్రామంలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఐఏయస్ గారు, జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు, కర్నూలు డిఎస్పీ విజయశేఖర్, కర్నూలు తాలుకా సిఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
దేవనకొండ యుపిఎస్ పరిధిలోని తెర్నెకల్లు, నెతలమర్రి, గుండ్లకొండ గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
దేవనకొండ యుపిఎస్ సిఐ కె. శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నందవరం పోలీసుస్టేషన్ పరిధిలోని నందవరం, ముగత్తి గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
నందవరం ఎస్సై తిమ్మయ్య మరియు పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.






