కిరణ్ 24×7 న్యూస్:
సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మం నగరంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని *సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రాజు పిలుపునిచ్చారు*
స్థానిక గూడూరు పట్టణంలోని సిపిఐ నాయకులు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రాజు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాలను వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభ గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి తరలిరావాలని వారన్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని దేశంలో రైతులకు కార్మికులకు కర్షకులకు వ్యవసాయ కూలీలకు కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రైవేట్ కార్పొరేట్లకు వత్తాసు పలుకుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల గూడూరు కార్యదర్శి బీడీల శ్రీనివాసులు ఏఐటియుసి మండల అధ్యక్షుడు ఓబ్లేసు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు..






