కిరణ్ 24×7 న్యూస్:
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సింగనగేరి కాలనీలో ఘనంగా ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు గూడూరు పట్టణం సింగనగేరి 7వ వార్డు లో సంక్రాంతి పండుగ సందర్భంగా7వ వార్డు కౌన్సిలర్ ఎం.రత్నమ్మ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.
ముగ్గుల పోటీలో పాల్గొన్న వారిలో మొదటి ఐదు బహుమతులను మహేశ్వరి, భవాని, చంద్రకళ ,సుజాత ,పల్లవి గెలుపొందారు. పోటీలో పాల్గొన్న వారందరికీ కూడా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దివంగత నాయకులు కో ఆప్షన్ నెంబర్ పుట్టపాసం రామాంజనేయులు ని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరుశురాముడు, E.భాస్కర్ , కొండన్న ,పెద్దయ్య ,వెంకటేశ్వర్లు వాసు, శేఖర్,గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. 






