కిరణ్ 24×7 న్యూస్:
సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి పండుగను పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని పాలకుర్తి రోడ్డుకు ఉన్నటువంటి శ్రీ రామాలయం ఆలయ ప్రాంగణంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళల ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది .

ముగ్గుల పోటీలను హిందూ సేవా సమితి సభ్యులు డమామ్ సురేష్ , బిజెపి సీనియర్ నాయకులు కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు ఆధ్వర్యంలో బజరంగదళ్ రాష్ట్ర గోరక్ష కన్వీనర్ మీనుగ రాజేష్ అధ్యక్షతన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది
ముగ్గుల పోటీలలో 40 మంది మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణయితలుగా డమాం సునీతబాయి పద్మావతి , రామలక్ష్మి, సోమేశ్వరి, శిరీష పాల్గొన్నారు. విజేతలకు వారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు
.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదన్న గారి గోరంట్ల,బేతపల్లి చిన్న మద్దిలేటి, భూషణ్ యాదవ్, మల్లికార్జున, వీరకేశవ, రాము, తదితరులు పాల్గొన్నారు.





