జ్యోతి హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

కిరణ్ 24×7 న్యూస్ :

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గూడూరు పట్టణంలో జ్యోతి హై స్కూల్ వారు ఘనంగా నిర్వహించారు. 250 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని గూడూరు పురవీధుల గుండా దేశభక్తి గేయాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ముఖ్యంగా బస్టాండ్ లో చిన్నారులచే మార్చ్ పాస్ట్ నిర్వహిస్తూ మరియు దేశభక్తి గీతాలకు చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతో ఆకర్షించాయి.

ఇటువంటి కార్యక్రమాలు పట్ల గూడూరు పట్టణ ప్రజలు జ్యోతి స్కూల్ యాజమాన్యం చైర్మన్ ఎల్. వెంకటేశ్వర్లు కరస్పాండెంట్ ఎస్ ఏ జిలాని పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పీఈటి మాస్టర్స్ ను ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. 10వ తరగతి పరీక్షల్లో కూడా ప్రతి సంవత్సరం జ్యోతి స్కూలు విద్యార్థులు తనకంటూ ప్రత్యేకత సహకరించుకోవడం విశేషం.