రాయలసీమను రతనాల సీమగా మార్చడమే చంద్రబాబు లక్ష్యం.. కోడుమూరు ఎమ్మెల్యే.
కిరణ్ 24×7 న్యూస్:
రాయలసీమను రతనాల సీమగా చేయడం చంద్రబాబు లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. పోతిరెడ్డి పాడు దగ్గర రాయలసీమ సాగు నీటి ప్రాజెక్ట్ లపై దొంగ దీక్ష చేయబోతున్న వైసీపీ నాయకులకు దీటుగా ముందుగానే స్పందిస్తూ కర్నూలు మండలం రుద్ర వరం గ్రామంలో HNSS కాలువ దగ్గర కూటమి ప్రభుత్వం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఏ విధంగా ముందుకెళ్తుందో తెలియజేసి అక్కడ కాలువలో ప్రవహించే నీటి ప్రవాహం సాక్షిగా జగన్ కుట్ర రాజకీయాలను కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఎండగట్టారు.
కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై దొంగ దీక్షలకు సిద్ధమవుతున్నారని ఇలాంటి కుట్ర రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 5 లక్షల కోట్ల పెట్టబడులలో కేవలం 2 వేల కోట్ల రూపాయలను రాయల సీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం వెచ్చించారని , అదే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 8 వేల కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందన్నారు .

ఎమ్మెల్యే పక్కా రాయలసీమ వాదిని అని చెప్పుకునే జగన్ రాయలసీమకు 5 ఏళ్ల పాటు తీరని ద్రోహం చేసి నేడు దీక్షల పేరుతో డ్రామాలకి తెర తీసిన నిజమైన రాయలసీమ ద్రోహి అని మండి పడ్డారు. . కూటమి ప్రభుత్వం హంద్రీనీవా ను 3780 కోట్లతో పూర్తి చేసి సుమారు 6 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించడం జరిగిందన్నారు.జగన్ ఇసుక దోపిడి వల్ల అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయి 39 మంది చనిపోయారన్నారు. ఆనాడు జగన్ ప్రభుత్వం తుంగభద్ర గేట్ల మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంతో తుంగభద్ర డ్యాం 19 వ క్రెస్ట్ గేట్లు కొట్టుకుపోయాయి అని అన్నారు. .
కూటమి ప్రభుత్వం లో సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో క్రాస్ ప్రోగ్రామ్ లాగా పనులు చేసి కేవలం 5 రోజుల్లో గేట్లను మరమత్తు చేయించారన్నారు. ఈ చర్య ద్వారా 40 టీఎంసీ ల నీటిని కాపాడగలిగాం అని అన్నారు.ప్రస్తుత తుంగభద్ర గేట్ల రిమోట్ కంట్రోల్ సిస్టమ్ పనులు 54.42 కోట్లతో కొనసాగుతున్నాయన్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు , చెరువులు జలకళతో కలకలలాడుతున్నాయన్నారు. దాదాపు 464 టీఎంసీ ల నిల్వ సామర్థ్యానికి నేడు 366 టీఎంసీల నీరు రాయలసీమ ప్రాజెక్టుల్లో నిల్వ చేసి రికార్డు సృష్టించామన్నారు.తెలుగు గంగ ,హంద్రీ నీవా సుజల స్రవంతి , గాలేరు నగరి సుజల స్రవంతి,వెలుగోడు రిజర్వాయర్, కేసి కెనాల్ , యస్ఆర్టీసీ,అవుకు, బ్రహ్మ సాగర్ వంటి ప్రాజెక్ట్ ల వెనుక ఎన్టీఆర్,చంద్రబాబు సంకల్పం నిబద్ధతే కనిపిస్తాయన్నారు.రాయలసీమను రతనాల సీమగా చేయడం చంద్రబాబు లక్ష్యమని జగన్ లా రాయలసీమకు ద్రోహం చేయడం లేదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బుర్ర వెంకటేష్ , మండల కూటమి నాయకులు ,కార్యకర్తలు , రైతులు పాల్గొన్నారు.







