*ఎమ్మిగనూరులో సీఎం చంద్రబాబు పర్యటన*
*మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ*
కిరణ్ 24×7 న్యూస్:,
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించారు. కలుగట్లలో జరిగిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొన్నారు..
శుక్రవారం ఉదయం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు కలుగట్ల గ్రామం చేరుకున్నారు. గ్రామసభలో పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

చివరిగా కలుగట్లలో జరిగే పార్టీ క్యాడర్ మీటింగ్‌కు హాజరయ్యారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి అమరావతి బయలుదేరి వెళ్లారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున రాష్ట్రంలో మొత్తం 279 గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం 1,16,870 డ్రాఫ్ట్ పాస్ బుక్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 91,038 డ్రాఫ్ట్ పాస్ బుక్స్ eKYC కూడా పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో 8,347 మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది.
అయితే, కలుగట్ల గ్రామంలో 1,178 మంది రైతులకు శుక్రవారం కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు జల వనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్, , కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, డిఐజి కోయ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బి. వి. జయ నాగేశ్వర రెడ్డి, పత్తికొండ శాసనసభ్యులు కెఈ.శ్యామ్ బాబు, ఆదోని శాసన సభ్యులు డా.పార్థసారథి వాల్మీకి, కోడుమూరు శాసన సభ్యులు బొగ్గుల దస్తగిరి, టిడిపి జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంత్రాలయం ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు ఇంఛార్జి వైకుంఠం జ్యోతి, కురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, బోయ కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, శ్రీశైలం బోర్డు డైరెక్టర్ రేఖ గౌడ్, డి.సి.ఎంఎస్ నాగేశ్వర రావు, కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







