అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య…

శ్రీశైల క్షేత్రానికి కాలినడకన బయలుదేరుతున్న భక్తులకు అన్నదాన కార్యక్రమాలు..

కిరణ్ 24 x7 న్యూస్ :
కర్నూలు జిల్లా వీరశైవ లింగాయతి రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో కాలినడకన శ్రీశైల క్షేత్రానికి తరలి వెళుతున్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్నో సంవత్సరాలుగా వీరశైవ లింగాయతి రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ తులసి కృష్ణ, నాయకులు గిరి నాదరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రామిరెడ్డి శివారెడ్డి, మరియు కమిటీ సభ్యులు, పెద్దలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.