దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి…. ఏఐటియుసి సిఐటియు ప్రజా సంఘాలు పిలుపు…….
మోడీ కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతికటిద్దాం
కార్మికులకు ఏఐటియుసి సీఐటీయూసీ పిలుపు.
కిరణ్ 24×7 న్యూస్:
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు ఈనెల 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ సెమ్మను జయప్రదం చేయాలని
**స్థానిక*
*కోడుమూరు పట్టణంలో స్టేట్* *బ్యాంక్.బిఎస్ఎన్ఎల్* . *ఆఫీస్. పోస్ట్ ఆఫీస్. ఆంధ్ర బ్యాంక్ రాయలసీమ గ్రామీణ* *బ్యాంక్. సమ్మెకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేయడం* *జరిగింది* . ఈ సందర్భంగా *సిపిఐ మండల కార్యదర్శి బి రాజు సిఐటియు మండల కార్యదర్శి వీరన్న* *ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధు* మాట్లాడుతూ..

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండా మరింత నిర్ధాక్షణంగా అమలు జరపడం 2025 నవంబర్ 21 తేదీ నుండి నాలుగు కార్మిక కోడ్స్ ను అమలు చేయాలని పూనుకున్నారు ఈ కోడ్స్ వలన కార్మికులకు చాలా అన్యాయం కార్మిక నాలుగు లేబర్ కొడ్స్ అమలు అయితే కార్మికుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని కార్మికులు యూనియన్ రిజిస్ట్రేషన్ గుర్తింపు సమిష్టి బేరాసారాల హక్కు సమ్మే హక్కు ఆందోళన చేసే హక్కు తీవ్రమైన ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉందని అందుకనే ఈ కార్మిక వ్యతిరేక విధానానికి ఫిబ్రవరి 12న అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు రైతులు వ్యవసాయ కూలీలు అసంఘటితరంగా కార్మికులు స్కీం వర్కర్లు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున ప్రతిఘటించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
భారత దేశానికి సంపదను సృష్టిస్తున్న సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్పడం అదాని అంబానీ అనేక ప్రైవేట్ సంస్థలకు దేశ సంపదను కొల్లగొట్టే ఇలాంటి వారికి దొంగలకు తాళం చెవి ఇచ్చినట్లు కాదా స్వాధీనం చేయడం దేశద్రోహం కాదా! అన్నారు రాజ్యాంగం ఇచ్చిన సార్వభౌమధికారానికి భంగం కలిగించి కార్పొరేట్లకు
సామ్రాజ్యవాదులకు తొత్తులుగా మారిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన ఉద్యమానికి కష్టించి పని చేసే ప్రతి శ్రామికుడు ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. 
అసంఘటిత రంగ కార్మికులైన ఆటో హమాలీ స్ట్రీట్ వండర్స్ వ్యవసాయ కూలీలు వెల్డర్స్ చికెన్ మటన్ షాపుల్లో పని చేసే వర్కర్స్ స్కూటర్ మెకానికులు స్కీం వర్కర్లైన అంగన్వాడీ, ఆశ మధ్యాహ్నం భోజన పథకం, స్కూల్ స్కావెంజర్స్,104,108 ఆరోగ్య మిత్ర, ఆర్పీలు,యానిమేటర్సు విద్యుత్తు మీటర్ రీడర్స్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ మెడికల్,ఆర్టీసీ,విద్య,ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు అనేక రంగాల్లో పనిచేసే కార్మికులందరికీ హక్కుల సాధన కోసం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం కార్మిక హక్కులు సాధించుకుందాం. కార్మికులను శ్రమ దోపిడీ చేసే పాలకుల ప్రభుత్వాలను కూల్చే వరకు అలుపెరుగని పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు చిన్న తదితరులు పాల్గొన్నారు.







