రెండేళ్లయిన గూడూరు నగరభివృద్ధిని విస్మరించిన కూటమి ప్రభుత్వం,,(సిపిఎం)
కిరణ్ 24×7 న్యూస్ :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా గూడూరు నగర అభివృద్ధి కి ఏమి చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ నారాయణ విమర్శించారు,, గూడూరులో పాత్రికేయుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వి,నారాయణమాట్లాడుతూ….
గత ప్రభుత్వం గూడూరు నగర పంచాయతీ ని అభివృద్ధి చెయ్యకపోవడంతో గూడూరు ప్రజలు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా గూడూరు నగర పంచాయతీ అభివృద్ధికి చేసింది ఏమి లేదని, పన్నుల వసూలు మాత్రం ప్రజల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారు తప్ప గూడూరు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని, గూడూరు పట్టణంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నదని, ఇప్పటికే కొన్ని వార్డులలో వారం రోజులైనా కూడా కొళాయిలకు నీళ్లు రావడంలేదని, వేసవికాలం వస్తున్నదని ఈ తాగునీటి సమస్య ఇంకా తీవ్రతరం అవుతుందని, గూడూరు పట్టణానికి నాలుగు దిక్కులుగా నాలుగు స్తంభాలు ఉన్నట్లు నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయని గత ప్రభుత్వం 54 కోట్లతో ప్రారంభించి ట్యాంకుల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, కూటమి ప్రభుత్వం పాలకులు కనీసం ఆ ట్యాంకుల గురించి మాట్లాడడం లేదని, ట్యాంకుల నిర్మాణం పూర్తయితే పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని , అదేవిధంగా మునగాల రోడ్డులో ఉన్న డంపు యార్డ్ వల్ల వచ్చే దుర్వాసనతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆ డంపు యార్డ్ ను ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేసి ప్రజలను అనారోగ్యాలకు గురికాకుండా కాపాడాలని సిపిఎం పార్టీగా అనేక దఫాలుగా పాలకులకు అధికారులకు విన్నవించుకున్న పెడచెవిన పెడుతున్నారని, ఈ ప్రాంతంలో ఉండే ఇసుకను తవ్వుకుని కాంట్రాక్టర్ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడని ఆ ఇసుక లారీల వల్ల గూడూరు పట్టణంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువైందని, ఆ ఇసుక కాంట్రాక్టర్ నుండి గూడూరు అభివృద్ధి కొరకు నిధులు రాబట్టుకోనీ అభివృద్ధి చేయాలని, గూడూరు పట్టణంలో పేద రైతులు వ్యవసాయ కూలీల అధిక సంఖ్యలో ఉన్నారని నగర పంచాయతీ చేశాక గూడూరు పట్టణానికి ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడంతో గూడూరు పట్టణంలో ఉన్న పేద ప్రజలకు వేసవి కాలంలో ఉపాధి లేకుండా పోయిందని, వేసవిలో ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని, వలసల నివారణకి గూడూరు పట్టణంలో ఏవైనా పరిశ్రమలు ఉన్నాయా అంటే ఒక్క పరిశ్రమ లేదని,గూడూరు పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్ లేదని ఉన్న ఒక్క ప్రాథమిక వైద్యశాల కేవలం జ్వరాలకు మాత్రమే ఉన్నదని ఆ వైద్యశాలను 50 పడకులకు అభివృద్ధి చేయాలని, గూడూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని, ఆ విధంగా గూడూరు అభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఓట్లు వేయించుకొని గూడూరు ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరియు అధికారులు గూడూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయకపోతే సిపిఎం పార్టీగా క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు,,
సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి
జే, మోహన్ మాట్లాడుతూ…. గూడూరు ప్రజలంటే గత ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వాలకు ఎందుకు అంత వివక్షతో అర్థం కావడం లేదని, గూడూరు ప్రజలు మనుషులు కారా అని,వారు ఓట్లు వేయలేదా అని, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పులను చూపిస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరు ను అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని నేడు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న గూడూరు అభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వ పాలకులు నోరు మెదపడం లేదని, గూడూరు పట్టణ ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పాలకులు అధికారులు గూడూరు పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించి గూడూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయకపోతే సిపిఎం పార్టీగా గడపగడపకు తిరిగి ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు,,, కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు దానమన్న, రామాంజనేయులు, రంగన్న తదితరులు పాల్గొన్నారు,






