కిరణ్ 24×7 న్యూస్ :
*అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం* *సందర్భంగా ఫిబ్రవరి.20 వ తేదీ శుక్రవారం.స్థానిక కోడుమూరు పట్టణ సామాజిక న్యాయం కోరుతూ. సీపీఐ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం కోరుతూ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది*…
.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న వంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు కొనసాగించాలని.
సామాజిక,ఆర్ధిక,రాజకీయ అసమానతలు అంతం చేయాలి.
కుల,మత,లింగ వివక్షతల నిర్మూలనకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.
కార్పోరేట్ల సంపదపై పన్నులు విధించాలి.ఆ సంపదను ప్రజలకు పునః పంపిణి చేయాలి.
జన గణనలో కుల గణన చేపట్టాలి.వాటి ఆధారంగా సామాజిక న్యాయం అందించాలి.
దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి.
లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
ప్రభుత్వ రంగ సంస్థలను,దేశ సహజ సంపద వనరులను కార్పోరేట్ లకు ధారాదత్తం చేయడం మానుకోవాలి.దేశ సంపదను పరిరక్షించాలి.
అవసరం బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి మధు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మహిళా సమైక్య జిల్లా నాయకులు సులోచనమ్మ. ఏఐటీయూసీ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






