వాల్మీకుల సమస్యల కోసం పోరాడిన నేతలకు కృతజ్ఞతలు… గూడూరు పట్టణ వాల్మీకి సంఘం అధ్యక్షులు.
కిరణ్ 24×7 న్యూస్ :
వాల్మీకుల సమస్యల కోసం అసెంబ్లీ సమావేశాలలో పోరాడిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన గూడూరు పట్టణ వాల్మీకి సంఘం అధ్యక్షులు పుట్టపాశం బాబు.
అసెంబ్లీ నందు జరిగిన సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బోయ వాల్మీకులు స్థితిగతులను వారి ఆర్థిక అసమానతులను అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి బోయ వాల్మీకులను ఎస్టి జాబితాలో చర్చి వారి అభివృద్ధికి సహకరించాలని కోరారు
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి వారి అభివృద్ధికై సహకరించాలని కోరిన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత్ర మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి వాల్మీకుల తరఫున గూడూరు పట్టణ వాల్మీకి సంఘం అధ్యక్షులు పుట్టపాశం బాబు ధన్యవాదములు తెలిపారు
వీరితోపాటు తెలుపుతూ గూడూరు వాల్మీకి సంఘం వైస్ ప్రెసిడెంట్ గిడ్డయ్య మద్దిలేటి విజయ్ కుమార్ కొండమీద కేసన్న వెంకటేష్ తదితరులు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.






