ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు గూడూరు పట్టణం నుండి చైర్మన్ జూలపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు నేతలు మహిళలు తరలి వెళ్లారు. వీధి ఆధ్వర్యంలో పట్టణం నుండి 15 బస్సులు ఎమ్మిగనూరులోని సిద్ధం సభకు తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పిఎన్అస్లాం మాట్లాడుతూ…
- కుడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ నేతృత్వంలో ఎమ్మిగనూరు పట్టణంలో జరిగే మేమంతా సిద్ధం సభకు గూడూరు పట్టణం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్ళినట్లుగా తెలిపారు. రాబోవు ఎన్నికల్లో ప్రజల పూర్తి మద్దతుతో వైసిపి పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో ఘనవిజయం సాధించి జగనన్నకు కానుకగా ఇస్తామని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.






