పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకున్న కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు.

ఈరోజు కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీ హకీం వీధికి చెందిన అబ్దుల్లా కుమారుడు షాహిద్ అనే పిల్లోడు పుట్టుకతోనే బుద్ధిమాన్యత లోపం సమస్యతో బాధపడుతున్న పిల్లవాడికి మెడికల్ సర్టిఫికెట్ అందేలా చేసి ఆ పేద కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు ఆదుకున్నారు..

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా పిల్లవాడి సమస్యను శ్రీ పరిగెల మురళీకృష్ణ గారి దృష్టికి తీసుకోని వెళ్ళిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా మా కుటుంబాన్ని ఆడుకున్న శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని మా కుటుంబం అంత జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు..

కార్యక్రమంలో శ్రీ పరిగెల మురళి కృష్ణ గారి వెంట స్థానిక నాయకులు కార్యకర్తలు మురళీకృష్ణ అన్నగారి అభిమానులు పాల్గొన్నారు..