ఈరోజు గూడూరు నగర పంచాయతీ పరిధిలోని మేము సిద్ధం ఎమ్మిగనూరు బహిరంగ సభకు కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు. సారాధ్యంలో, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదిమూలపు సతీష్ నాయకత్వంలో దాదాపు 350 మంది వైసీపీ కార్యకర్తలు మరియు కార్యకర్తలు మరియు మహిళలు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు, కోఆప్షన్ నెంబర్ పుటపాశం రామాంజనేయులు, తిమ్మా గురు స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎస్ ఈ భాస్కర్, టీఎస్ రాజు, కౌన్సిలర్లు జింకల కుమార్ , కలాం భాష,విజయుడు, బజారి, దస్తగిరి, వీరితోపాటు వైసీపీ నాయకులు ఎల్ల గౌడ్ సంజీవనగర్ డ్రైవర్ గిడ్డయ్య, కంపాటి నాగరాజు, అగ్గి రాముడు, భూపతి నాయుడు, విజయ్ లతోపాటు సింగనగేరి, పొండిగేరి, మూలగేరి, బోయగిరి, సంజీవయ్య నగర్, తెలుగు వీధి, బీసీ కాలనీ ఎస్సీకాల నీలకు చెందిన మహిళలు యువకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు…
ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగనన్న తోనే సాధ్యమవుతుందని రాబోవు ఎన్నికల్లో వైసిపి పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారని రాబోవు ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధించి జగనన్న కు కానుకగా ఇస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు..






