kiran24x7news:-గూడూరు నగర పంచాయతీలో సోమవారం టిడిపి పార్టీ కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొగుల దస్తగిరి సుడిగాలి పర్యటన చేసి ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు..
గూడూరు నగర పంచాయతీ నందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె.రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ గార్ల ఆధ్వర్యంలో 1 వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి 1వ వార్డు మరియు 20,13వ వార్డుల నందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వార్డు ప్రజలకు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారికి గూడూరు నగర పంచాయతీ ప్రజలు బ్రహ్మారధం పట్టారు. అనంతరం బొగ్గుల దస్తగిరి గారు గూడూరు నగర పంచాయతీలోని 1,20,13వ వార్డులలో పర్యటించి నగర ప్రజలకు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశీర్వాదించాలని విజ్ఞప్తి చేశారు..
ఈ కార్యక్రమంలో నాయకులు రేమట వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు , శశా వలి కుమ్మరి ఎల్లయ్య మాజీ కౌన్సిలర్లు పి.మధువర్ధన్,కె. నరసింహులు,టీడీపీ పార్టీ మండల కన్వీనర్ జె. సురేష్,పి.చాంద్ బాష,టీడీపీ పార్టీ నాయకులు బోజుగు పౌలు,తెలుగు శీను,కె.విజయ్ కుమార్,కె.వీర కుమార్,ఇసాక్,గౌండ కుమార్,పి. రవి,చందు,నాగప్ప,సి.విజయ్,చిరంజీవి,హరినాథ్,మనిరాజు,కిరణ్,అబ్రహం, చంటి, ప్రతాప్ కళ్యాణ్ రఘు జనసేన నాయకులు ఎల్లప్ప,దిలీప్ కుమార్ మరియు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..






