kiran24×7news : కర్నూలు మండలం ఉల్చాల గ్రామానికి చెందిన సాహెబ్ భాష అనారోగ్యానికి గురై ఓమిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం చేరడంతో వైయస్ఆర్ సీపీ కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు ఆసుపత్రి కి వెళ్లి, సాహెబ్ భాష గారిని పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. వారితోపాటు మాజీ మండల ఉపాధ్యక్షులు డి వాసు, ఎస్సీ సెల్ జాయింట్ కార్యదర్శి ప్రసాద్, ఉల్చాల సర్పంచ్ విద్యాసాగర్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన లచ్చన్న కుమారుడు వేణుగోపాల్ బైక్ పైనుంచి కిందపడి తీవ్ర గాయాలతో కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ లో చేరాడనే విషయం గ్రామ నాయకుల ద్వారా తెలియడంతో వెంటనే ఆసుపత్రికి చేరుకొని వేణుగోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన వైయస్ఆర్ సీపీ కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి – డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..






