kiran24×7news :  గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగాల, మల్లాపురం గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు.

ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో పోలీసులు కవాతు నిర్వహించామని గూడూరు యస్ ఐ హనుమంతయ్య తెలిపారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల (“సశస్త్ర సీమా బల్”) పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు గూడూరు యస్ ఐ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు.