( కిరణ్ 24×7 న్యూస్ )
కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర మేధావుల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మేధావుల విభాగం అధ్యక్షులు ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వైసిపి పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త కోట్ల హర్షర్దన్ రెడ్డి , మరియు కోడుమూరు నియోజవర్గ వైయస్సార్సీపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మనోహర్ రావు, మేధావుల రాష్ట్ర కార్యదర్శి తిరుమలేశ్ రెడ్డి, పూజారి ధనుంజయ ఆచారి, కోడుమూరు నియోజకవర్గం మేధావులు విభాగం అధ్యక్షులు రవీంద్రారెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.