కిరణ్ 24×7 న్యూస్:

*సిపిఐ శత వార్షికోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయండి* … *సిపిఐ జిల్లా* *సహాయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు*

బైకు రాలీ ని ప్రారంభిస్తున్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శత వార్షికోత్సవాల ముగింపు సభ ను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు.ఎస్టియు రాష్ట్ర నాయకులు తిమ్మన్న  పిలుపునిచ్చారు. బుధవారం కోడుమూరు పట్టణంలోని సిపిఐ శత వార్షికోత్సవాల సందర్భంగా కోట్ల సర్కిల్ కూడలి నుండి బైకులతో పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా *సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు.* మాట్లాడుతూ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని మొట్టమొదట నినాదం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేసి లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంపిణీ చేసిన ఘనత సిపిఐ కి దక్కిందన్నారు.

రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణం, వెట్టిచాకరి విముక్తికై సిపిఐ అనేక ప్రజా ఉద్యమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 18 న ఖమ్మంలో జరిగే సిపిఐ శత వార్షికోత్సవాల ముగింపు సభకు పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బి రాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ ఏఐటీయూసీ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధు సిపిఐ పట్టణ కార్యదర్శి శేష్ కుమార్ యాదవ్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు మద్దూరు చిన్న రాముడు. వ్యవసాయం కార్మిక సంఘం పట్టణ నాయకులు రామాంజనేయులు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి.అల్తాఫ్. హమాలి యూనియన్ నాయకులు విశ్వనాథ్ రైతులు సిపిఐ ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు