కిరణ్ 24×7 న్యూస్:

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని కార్మికుల పాత చట్టాలను అమలు చేయాలని గూడూరులో సిఐటియు మండల నాయకులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నాయకులు,కార్మికులు
లేబర్ కోడ్ ల గెజిట్ కాపీలను భోగిమంటలవేసి దగ్ధం చేయడం జరిగింది,,
ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి జే,మోహన్ మాట్లాడుతూ,,,

భోగిమంటల్లో కాలుస్తున్న కార్మికులు

రాష్ట్రవ్యాప్తంగా ఈ తీర్మానాన్ని కార్మికులు వ్యతిరేకించడంతో, రాష్ట్ర ప్రభుత్వం పునరాలచనలు పడిందని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు కార్మికులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని చెప్పి. ఓట్లు వేయించుకొని అధికారం వచ్చినాక కార్మికుల సమస్యలు పట్టించుకోకపోగా

కార్మికులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయకపోతే
కార్మికులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన అన్నారు,
కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు మద్దిలేటి, మధు, మల్లికార్జున, భూత రామాంజనేయులు, గోపి, శేఖర్, మోహన రంగడు, ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు రాజు, పాముల శివ, ఏసేపు తదితరులు పాల్గొన్నారు.