గూడూరులో ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నిక…
మండల అధ్యక్షుడిగా దౌలత్ ఖాన్ ఏకగ్రీవం…
ఉపాధ్యక్షుడిగా కే. ప్రభాకర్ నాయుడు, గౌరవ అధ్యక్షుడిగా శరత్ బాబు.

కిరణ్ 24x 7 న్యూస్:
గూడూరు మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన మండల అధ్యక్షుడిగా దౌలత్ ఖాన్ ను కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం గూడూరు పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ ఆవరణలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల నూతన కార్యవర్గ ఎన్నికల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు ఎపిడబ్ల్యుఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. గోరంట్లప్ప జిల్లా సీనియర్ నాయకులు టి. జి ప్రసాద్, చంద్రమోహన్, శివకుమార్ ,హుస్సేన్
హాజరయ్యారు. వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా వార్త విలేఖరి  దౌలత్ ఖాన్ ఖాన్ ను ఉపాధ్యక్షుడిగా ప్రజాశక్తి విలేఖరి ప్రభాకర్ నాయుడును గౌరవ అధ్యక్షులుగా సూర్య విలేకరి శరత్ బాబును ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా పల్లె వాణి బ్యూరో ఇన్చార్జ్ కిరణ్ కుమార్ ను మరియు రిపోర్టర్ మహబూబ్ బాషా, అబ్దుల్లాను, సభ్యులుగా ఇస్మాయిల్ ఇషాక్ బాషా మిన్నల్ల రాజశేఖర్ ఎర్రన్న
తదితరులను ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ విలేకర్ల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తరపున పోరాటాలు జరపాలని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. మండలంలో నెలకొని ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసి ప్రతి విలేకరి తమ వృత్తికి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర జిల్లా అధ్యక్షులను విలేకరులు ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను రాష్ట్ర జిల్లా నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోహన్, గుంటప్ప సి.బెళగల్ ప్రజాశక్తి మండల విలేఖరి వెంకట్ మండల విలేకరులు తదితరులు పాల్గొన్నారు.