కిరణ్24×7 న్యూస్:
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ సంతాపం..

కోడుమూరు నియోజకవర్గంలోని సీ బెలగల్ మండల పరిధిలోని కే. సింగవరం గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు రాఘవ రెడ్డి, చింతామనుపల్లె గ్రామానికి చెందిన బోయ హనుమంతు అకాలంగా మృతి చెందడం పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి ద్వారా సమాచారం అందుకున్న వెంటనే కుడా మాజీ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయా గ్రామాల్లోని వారి స్వగృహాలకు వైయస్ఆర్‌సీపీ నేతలు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ వెళ్లి పార్థివ దేహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు, నాయకుల అకాల మరణం వైయస్ఆర్‌సీపీకి తీరని లోటని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
వారితో పాటు జిల్లా మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం భాషా, మేధావులు విభాగం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, రాధాకృష్ణారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు నరసింహులు, డాక్టర్ విభాగం అధ్యక్షులు, కో ఆప్షన్ మెంబర్ హారన్, మండల ట్రెజరీ వెంకటేష్, యువజన విభాగం జిల్లా కార్యదర్శి రాజు, మండల ఉప అధ్యక్షులు మహానంది, లచప్ప, రామచంద్ర రెడ్డి, మండల కార్యదర్శి మద్దిలేటి, రామకృష్ణ, దస్తగిరి, రంగా నాయుడు, వెల్డింగ్ అహమ్మద్, ముల్లా బాషా, ఖాజా, వీరన్న, సుంకన్న, బజారి, నాయకులు కార్యకర్తలు తదిరులు ఉన్నారు.







