అప్పుల బాధతో రైతు ఆత్మహత్య…
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య…
కిరణ్ 24x 7 న్యూస్:
గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన సింగాని చిన్న వెంకటేశ్వర్లు,( వయసు 55) సంవత్సరాలు, వ్యవసాయం వలన జీవనం కొనసాగించేవాడు. అప్పుల బాధతో ఆదివారం తెల్లవారుజామున సుమారు 5గంటల సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

మృతుడు సింగాని చిన్న వెంకటేశ్వర్లు ఆదివారం పంట పొలాల్లోని వేప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. గమనించిన మృతుని కొడుకు సింగాని శ్రీనివాసులు వెంటనే కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తండ్రి చిన్న వెంకటేశ్వర్లను తీసుకొని వెళ్లారు.
ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి రైతు చిన్న వెంకటేశ్వర్లు ఆసుపత్రికి రాకమునుపే మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
మృతుడు చిన్న వెంకటేశ్వర్లు సొసైటీ బ్యాంకు లోను మరియు గ్రామస్తుల దగ్గర అప్పులు ఎక్కువగా ఉండడంతో అప్పుల బాధ తట్టుకోలేక మనస్థాపానికి గురై ఉరి వేసుకొని మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపినట్లుగా గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప సమాచారం ఇచ్చారు..
మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం…
మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం… గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ,..
కిరణ్ 24×7 న్యూస్:
జనవరి నెల 18-01-2026 తేదీన పొన్నకల్ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో, 21-01-2026 తేదీన ఫిర్యాదుదారురాలు బాలికతో కలిసి గూడూరు పోలీసు స్టేషన్కు వచ్చి రాతపూర్వక నివేదికను సమర్పించారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలం మరియు ఫిర్యాదు ఆధారంగా, ఈ కేసును ‘మిస్సింగ్ కేసు’ నుండి భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 87 r/w 3(5) మరియు పోక్సో చట్టం (POCSO Act) సెక్షన్ 3(a), 4 కిందకు మారుస్తూ తీవ్రమైన నేరంగా నమోదు చేయడం జరిగింది.
బాధితురాలిని తక్షణమే కోడుమూరు సి.హెచ్.సి (CHC) వైద్యుని వద్దకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించడమైనది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ (RFSL) కు పంపడం జరిగింది.
అదే విధంగా వన్ స్టాప్ సెంటర్ (One Stop Centre) లో మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ద్వారా బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగినది. అనంతరం గౌరవనీయ మెజిస్ట్రేట్ ఎదుట బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేయించడం జరిగింది.
బాలికకు మానసిక ధైర్యాన్ని అందించేందుకు మరియు కౌన్సెలింగ్ నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కి పంపడం జరిగింది.
దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన A1 ని అరెస్ట్ చేయడం జరిగినది. నిందితుడిని కర్నూలులోని గౌరవనీయ జె.ఎం.ఎఫ్.సి (JMFC) ప్రత్యేక మొబైల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది.
మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
~ఎస్.ఐ, గూడూరు PS.
నమ్మకద్రోహం , దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ …
నమ్మకద్రోహం , దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ …
కిరణ్ 24×7 న్యూస్:
కోడుమూరు రోడ్ లో మహేక్ ఎంటర్ప్రైసెస్ సానిటరీ షాప్ కలదు. యజమాని సల్మాన్ బాషా అందులో పని చెేయడానికి గుమస్తా గా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ని నియమించుకొని నెలకు రూ. 10 వేల జీతం ఇస్తూ కావాల్సిన సదుపాయాలు కల్పించినాడు.
సదరు గుమస్తా మీద పూర్తి నమ్మకంతో షాపు నిర్వహణ అంతా అతనికి వదిలేసి ఉండగా, ఇదే అదనుగా భావించిన గుమస్తా ప్రవీణ్ కుమార్, యజమానికి అనుమానం రాకుండా అతనికి తెలియకుండా అతని స్నేహితుడైన పవన్ కళ్యాణ్ అనే ఆటో డ్రైవర్ తో మాట్లాడుకొని గత 5 నెలలుగా ఇద్దరూ కలిసి యజమాని లేని సమయం లో సదరు షాపు లోని సానిటరీ వస్తువులు అనగా commods, వాష్ బేసిన్ లు, హ్యాండ్ వాష్ బేసిన్స్, కిచెన్ ఐటమ్స్ ఇలా రక రకాల ఐటమ్స్ ను వీరు ఇద్దరు కలిసి దొంగలించి వారి యజమానే పంపించినట్టుగా బయటి వారిని నమ్మిస్తూ సుమారు రూ. 7 లక్షల విలువ చేసే వస్తువులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.
యజమాని సల్మాన్ ఇచ్చిన ఫిర్యాదు పై నమ్మకద్రోహం, దొంగతనం కింద కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు లో వీరు ఇరువురు సదరు నేరానికి పాల్పడినారు అని ధ్రువీకరించుకొని, వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారించారు.
వారు దొంగతంగా అమ్ముకున్న వస్తువులను అన్నిటిని రికవరీ చేసుకొని సదరు యజమానికి అప్పగించి సదరు నేరానికి పాల్పడిన ఇద్దరిని రిమాండ్ కి పంపడం జరిగింది….
ఈ కార్యక్రమంలో నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహా తో పాటు ఎస్సైలు చంద్రశేఖర్, శరత్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.
* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.
* చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
కిరణ్ 24×7 న్యూస్:
డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు..


కే. నాగలాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా బాధ్యతల స్వీకరణ…
కే. నాగలాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా బాధ్యతల స్వీకరణ…
కిరణ్ 24×7 న్యూస్ :
గూడూరు మండలం కే. నాగలాపురం గ్రామంలోని పోలీస్ స్టేషన్ నందు బుధవారం ఎస్సైగా కే. అఖిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం
ఎస్సై కే. అఖిల్ కుమార్ గ్రామంలో వెలిసిన శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం దేవస్థానమునకు విచ్చేసిన ఎస్సై అఖిల్ కుమార్ ను గ్రామ పెద్దలు గోపాల్ రెడ్డి మరియు సుంకన్న పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది కేశవ ప్రత్యేక పూజలు చేయించారు. కే నాగలాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్సై శరత్ కుమార్ రెడ్డి ని స్థానిక పెద్దలు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.


రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న పోలీసులు..
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.
* చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
కిరణ్ 24×7 news:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు కర్నూలు పరిధిలోని గూడూరు కోడుమూరు సి.బళగల్ పత్తికొండ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

రాత్రి బస (పల్లె నిద్ర) కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసులు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాలతో రాత్రి బస (పల్లె నిద్ర) కార్యక్రమాలు నిర్వహిస్తున్న కర్నూలు పోలీసులు.
కిరణ్ 24×7 న్యూస్:
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ పోలీసు అధికారులు ఆయా సమస్యాత్మక గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 6 గ్రామాలలో రాత్రి బస ( పల్లె నిద్ర) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గూడూరు సి.బెళగల్ కర్నూలు రూరల్ పరిధిలోని సమస్యత్మక గ్రామాలలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్సైలు సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు
.
గ్రామస్తులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గొడవలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాల జోలికెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మకూడదని, మహిళలు, బాలబాలికల పై జరిగే నేరాలు, సైబర్ మోసాల బారిన పడకూడదని, అపరిచితుల కాల్స్ మరియు లింకులు క్లిక్ చేయరాదని, బ్యాంకు ఖాతాల ఓటిపిలు తెలియని ఎవరికి చెప్పకూడదని, రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన చేస్తున్నారు.
ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930 కి కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు.
రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు అవగాహన చేస్తున్నారు.
గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తమ వంతు భాద్యతగా గ్రామాలలోని యువత, ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో పోలీసు అధికారులు, గ్రామాలలోని ప్రజలు యువత, తదితరులు పాల్గొన్నారు.

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన మదాసికురువ/మాదారికురువ హక్కుల సాధన సమితి నాయకులు
కిరణ్ 24 x 7 న్యూస్:.మదాసికురువ/మాదారికురువ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సభ్యులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గూడూరు మండల తహశీల్ధార్ కే. రామాంజనేయులు కు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులజాబితాలో వున్న మదాసికురువ/మదారికురువ కులమార్పిడి రెవెన్యూ అధికారులు పాల్పడుతున్నారని అలాంటి చర్యలు జరగకుండా చూడాలని వారు కోరారు .మదాసికురువ/మదారికురువ లో కురువ అంతర్భాగం అనిమదాసికురువ/మదారికురువ సాధారణ ప్రజలు కురువ (లేదా) కురువొళ్ళు అని అంటారు అని కురువగా పిలువబడుతున్న మదాసికురువ/మదారికురువలను రెవిన్యూ అధికారులు Sc కులపత్రానికి బదులుగా ‘కురుబ’ BC-B అని మంజూరు చేస్తూ కుల మార్పిడికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కులమార్పిడి చట్టరీత్య నేరము అని .మదాసికురువ/మాదారికురువ హక్కుల సాధన సమితి సభ్యులు ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి గొర్రెల సహకార సంఘం డైరెక్టర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున గూడూరు మండల సంఘం నాయకులు టైలర్ దస్తగిరి, వెంకటేష్, మునిష్, రంగన్న, దినేష్, రాజు, వెంకటేశ్వర్లు, శివ, లక్ష్మన్న, మిన్నెల, శ్రీరాములు, మధు, సురేష్, ఆనంద్, భీమేష్, రమేష్, మరియు యువకులు పాల్గొన్నారు.
గూడూరు పోలీస్స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ..
కిరణ్ 24×7 న్యూస్: కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గూడూరు పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ బాబు ప్రసాద్ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఎస్సైని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలను నియంత్రించడంతో పాటు శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించాలన్నారు.. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. అనంతరం డీఎస్పీ బాబు ప్రసాద్ సిసి కెమెరాలు, సిబ్బంది పని తీరును పరిశీలించడంతో పాటు పెండింగ్ ఫైల్స్, చోరీలు, ఐటీ కేసుల స్థితిగతులపై రికార్డులను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పద్ధతులను పాటించాలన్నారు. పోలీస్స్టేషన్ రికార్డులను, పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు సీఐ మహమ్మద్ తబ్రేజ్ . ఎస్సై తిమ్మయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.















