ఇంద్రజిత్తు గుప్తా కాలనీ నందు డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్లు ఏర్పాటు చేయాలి.
ఇంద్రజిత్తు గుప్తా కాలనీ నందు డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్లు ఏర్పాటు చేయాలి.
ఏపీ మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి సులోచనమ్మ డిమాండ్..
Kiran24x7news :
కోడుమూరు :- ఇంద్రజిత్తు గుప్తా కాలనీ నందు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని ఏపీ మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి సులోచనమ్మ డిమాండ్ చేశారు.
శనివారం స్థానిక ఇంద్రజిత్తు గుప్తా కాలనీ నందు ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పలు సమస్యలను పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కాలనీ నందు డ్రైనేజీ కాలవలు, సిసి రోడ్లు లేనందువలన మురికినీరు రోడ్లపై ప్రవహించి దుర్గంధం వ్యాప్తి చెందుతుందన్నారు.
దీనివలన దోమల బారిన పడి ప్రజలకు రోగాలు వ్యాపిస్తున్నాయనీ ఆరోపించారు. కాలనీ పై భాగంలో డ్రైనేజీ ఏర్పాటు చేయడం వలన అక్కడ వేస్టేజ్ వాటర్ అంతా క్రింద కాలనీ పిల్లల్లోకి ప్రవహించి చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇంద్రజిత్తు గుప్తా కాలనీ నందు సమస్యలు పరిష్కరించాలని గతంలో అనేకమార్లు అధికారులకు విన్నవించు కున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని కాలనీ ప్రజలు ఆరోపించారు.
ఇప్పటికైనా కాలనీ నందు డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్లు ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సరోజమ్మ, సుంకులమ్మ, గోవిందమ్మ, శకుంబి తదితరులు పాల్గొన్నారు.
చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ …. కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్.
చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ …. కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్.
దొంగలించబడిన మొత్తం సొత్తు రికవరీ.
Kiran 24×7 news
20 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు రికవరి చేసిన … కర్నూలు పోలీసులు.
కర్నూలు డిఎస్పీ కార్యాలయం లో నిందితుల వివరాలను వెల్లడించిన … కర్నూలు డిఎస్పీ.
జరిగిన విషయం…
కర్నూల్ నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని అమీన్ అబ్బాస్ నగర్ కు చెందిన వెంకట సుబ్బయ్య గారు పేపర్ మిల్ లో పని చేస్తూ రిటైర్ అయ్యారు. ఒక కార్యం నిమిత్తం 2026 మార్చి 27 న న కడప కి వెళ్ళాడు.
2026 మార్చి 29 అర్ధ రాత్రి సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటి తాళాలు పగులకొట్టి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించారు.

ఇంటిలోని బీరువా తాళాలు పగులగొట్టి అందులోని సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు దొంగలించుకోపోయారన్న ఫిర్యాదు పై కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు పరిచారు.
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పీ శ్రీ బాబు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహ, కర్నూలు త్రీ టౌన్ శేషయ్య, ఎస్సై చంద్ర శేఖర్ రెడ్డి, క్రైమ్ పార్టీ పోలీసులు మురళీధర్, సుబ్బారాయుడు, వాసు, సుంకన్న, చెంచన్న, శేఖర్ లు ప్రత్యేక బృందాలుగా ఏర్ప డ్డారు.
దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న CC TV ఫుటేజ్ లను పరిశీలించారు.
దొంగతనానికి పాల్పడిన నిందితులు బాలాజీ నగర్ లో నివాసముండే ఇద్దరు మైనర్ లుగా గుర్తించారు.
ఈ రోజు ఉదయం మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద వారిని అరెస్ట్ చేాశారు.
వారి నుండి దొంగతనం చేయబడిన మొత్తం సొత్తును రికవరీ చేసి వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పెట్టడమైనది.
వీరు గతం లో కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో గణేష్ నగర్ నందు RTC DM వారి ఇంట్లో కూడా దొంగతనానికి పాల్పడ్డారు.
ప్రజలకు ముఖ్య గమనిక :
ఎండాకాలం అని ఇంటికి తాళాలు వేసి ఆరుబయట /ఇంటి మీద పడుకొనే వారు, బయటి ప్రాంతాలకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మన అజాగ్రత్త దొంగలకు ఆదాయం వనరు అని, అప్రమత్తంగా ఉండాలని కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పేదలకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసిన వ్యక్తులపై – టిడిపి నేతల ఆగ్రహం..
పేదలకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసిన వ్యక్తులపై – టిడిపి నేతల ఆగ్రహం..న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా..
కిరణ్ 24×7 న్యూస్ :
కొందరు నేతలు అధికారులతో కుమ్మక్కై పేద ప్రజలకు చెందాల్సిన పార్కు స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారంటూ సోమవారం టిడిపి నాయకులు నేతలు ధర్నా నిర్వహించారు.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలోని ఎర్రగుంట్ల రోడ్డులో 1992 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇల్లు లేని పేదల కోసం ఒక్కొక్కరికి 2.5 సెంట్ల స్థలాలను కేటాయించింది.ఆ లేఔట్‌లో ప్రజల వినియోగార్థం ప్రత్యేకంగా పార్కు కోసం కూడా ఖాళీ స్థలాన్ని కేటాయించారు. కాలక్రమేణా ఆ ప్రదేశం మొత్తం కంపచెట్లు పెరిగి నిర్లక్ష్యంగా మారింది.
2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త డి. విష్ణువర్ధన్ రెడ్డి స్వంత నిధులతో ఆ స్థలాన్ని శుభ్రపరచించి లేఔట్ వేయించినట్లు స్థానికులు తెలిపారు.అయితే 2019లో అప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు పట్టణానికి చెందిన కొంతమంది నాయకులు ఆ పార్కు స్థలంపై కన్నేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
పార్కు కోసం కేటాయించిన స్థలానికి దొంగ పట్టాలు సృష్టించి, అక్కడ బండలు పాతి స్థలాన్ని కబ్జా చేశారని స్థానికులు కాలనీ ప్రజలు టిడిపి నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, వారు మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో మాట్లాడి పార్కు స్థలాన్ని యథావిధిగా ప్రజల వినియోగానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నగర పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 
అక్రమంగా పొందిన ప్లాట్లను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం తెలిసిన వెంటనే గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుల్లాయప్ప అక్కడికి చేరుకుని వారిని సముదాయించి ధర్నాను విరమింప చేశారు అనంతరం నగర పంచాయతీ కమిషనర్ టిడిపి నేతలతో మాట్లాడి పేదల స్థలాలను కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో టిడిపి నేతలు ధర్నాను విరమించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షులు మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు టిడిపి పట్టణ నాయకులు రేమట వెంకటేశ్వర్లు, సృజన్ ,కౌన్సిలర్లు కోడుమూరు షాషావలి, ఎల్లయ్య, వీర సులేమాన్ అబ్రహం మరియు స్థానిక టిడిపి నాయకులు నేతలు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

బాలికల వసతిగృహం నిర్మాణ పనుల్లో లోపించిన నాణ్యత…
బాలికల వసతి గృహం నిర్మాణం పనుల్లో లోపించిన నాణ్యత.. కాంట్రాక్టర్ పై అధికారుల ఆగ్రహం..
కిరణ్ 24×7 న్యూస్ :
గూడూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న బాలికల వసతి గృహం నిర్మాణం పనుల్లో నాణ్యత లేదని సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా నిర్మాణాలు చేపట్టారని పరిశీలనకు వచ్చిన రాష్ట్ర, జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం విద్యా సంక్షేమం మౌలిక సదుపాయాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్ జి. నాగముని, డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ పూర్ణచంద్రరావు మరియు సిబ్బందితో కలిసి బాలికల వసతి గృహం నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని కాంట్రాక్టర్ అరకొరగా నిర్మాణాలు చేపట్టారని వారు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత విషయాలను విలేకరులకు తెలియజేశారు. నిర్మాణ పనులపై సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్ పై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపాలిటీ నీటి తొట్టిలో పడి చిన్నారి బాలిక మృతి..
మున్సిపాలిటీ నీటి తొట్టిలో పడి చిన్నారి బాలిక మృతి..
కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పట్టణంలోని పడమర బీసీ కాలనీ ఎస్ఎస్వి కళాశాల వెనుకవైపు ఉన్న కొట్టాల కాలనీలో శనివారం మధ్యాహ్నం చిన్నారి బోయ విజయలక్ష్మి(5) అనే బాలిక ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు మున్సిపాలిటీ వారు ఏర్పాటుచేసిన నీటి తొట్టి లో పడి మృతి చెందింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు సమాచారం.. బోయ రేవుల గోపాల్ మరియు శ్రీదేవి దంపతులకు ఒక కూతురు విజయలక్ష్మి (5),కుమారుడు గోపీచంద్(7) కలరు. తల్లిదండ్రులు ఇద్దరు బ్రతుకుతెరువు కోసం గుంటూరుకు వలస వెళ్లారు. తమ కూతురు బోయ విజయలక్ష్మి నీ తాత పాపన్న దగ్గరే ఉంచి వెళ్లారు. తాత అవ్వ మనవరాలిని చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం తాత అవ్వ వారి పనుల్లో నిమగ్నం అయిన సమయంలో మనవరాలు బోయ విజయలక్ష్మి ఆటలాడుకుంటూ కాలనీలో సమీపంలో ఉన్న మునిసిపాలిటీ నీటి తొట్టి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది.
మనవరాలు కనిపించడం లేదంటూ తాత పాపన్న వెతుకుతూ వెళ్లి చూసేసరికి మనవరాలు నీటి తొట్టి లో మృతదేహంలా పడి ఉంది. చిన్నారి మనవరాలు నీటి తొట్టి లో పడి మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించారు.
నీటి తొట్టిల ఏర్పాటు ప్రమాదకరంగా మారాయని కాలనీ ప్రజలు అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదంటూ కాలనీ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నీటి తొట్టి లకు మూతలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి…కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .
* ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత .
* పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .
* అందరూ సమన్వయంతో పని చేయాలి.
* ట్రాఫిక్ నియంత్రణ , రూట్ బందోబస్తు అత్యంత కీలకం.
* ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
కిరణ్ 24×7 న్యూస్:
2026 ఫిబ్రవరి 6 న ( శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు మండలం , కలుగొట్ల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో కలుగొట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి బహిరంగ సభ దగ్గర కు బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసు అధికారులకు, సిబ్బందికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు.

సిఎం గారి పర్యటనలో క్షేత్రస్థాయి అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు సెక్టార్ల వారీగా అప్రమత్తంగా ఉండాలన్నారు.
కేటాయించిన విధులలో భాద్యతయుతంగా ఉండాలన్నారు.
ముఖ్యమంత్రి పర్యటించే రూట్ & రూఫ్ – టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్, హెలిప్యాడ్, సభ ప్రాంగణం తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు , స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు.
వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ట్రాఫిక్ నియంత్రణ , రూట్ బందోబస్తు అత్యంత కీలకమన్నారు.
ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు.చేయకూడనవి, చేయవలసిన వాటి గురించి తెలిపారు.

అనంతరం కర్నూలు ఎస్పీ హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు CM కాన్వాయ్ రిహార్సల్స్ ట్రయల్ రన్ ను పరిశీలించారు.
కాన్వాయ్ రిహార్సల్స్ ట్రయల్ రన్ లో భద్రతా పరమైన అంశాలను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు యుగంధర్ బాబు, కృష్ణమోహన్ , కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి గారి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత …
ముఖ్యమంత్రి గారి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత …
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .
* 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు.
* పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
ఏర్పాట్ల పై ఆరా తీసి పరిశీలించిన … కర్నూలు ఎస్పీ .
కిరణ్ 24×7 న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు మండలం , కలుగొట్ల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో హెలిప్యాడ్, ప్రజావేదిక ఏర్పాట్లను కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి , కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ , ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి , జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ భద్రత ఏర్పాట్లను బుధ వారం పరిశీలించారు.

ముఖ్యంత్రి హెలిప్యాడ్, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ , ఇతర భద్రత ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పటిష్ణ భద్రత కు పోలీసు బందోబస్తు ఏర్పాట్ల గురించి మాట్లాడారు.
ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంయుక్తంగా రెవిన్యూ , పోలీసులు గౌరవ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి పర్యటించే రూట్ & రూఫ్ – టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్, సభ ప్రాంగణం , తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు , స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు , బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసు అధికారులు , పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు.
వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.

కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు.
ఇందులో జిల్లా ఎస్పీ గారితో పాటు ముగ్గురు అడిషనల్ ఎస్పీలు , 8 మంది డిఎస్పీలు, 55 మంది సిఐలు, 88 మంది ఎస్సైలు , 297 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు , 485 మంది కానిస్టేబుళ్ళు , 61 మంది మహిళా పోలీసులు, 191 మంది హోంగార్డులు, 2 సెక్షన్ల ఎఆర్ పోలీసులు, 14 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు.

జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ లతో పాటు సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ , ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, హోంగార్డు డిఎస్పి ప్రసాద్ , కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు , టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ , సిఐలు, ఎస్సైలు ఉన్నారు.
మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం…
మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం… గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ,..
కిరణ్ 24×7 న్యూస్:
జనవరి నెల 18-01-2026 తేదీన పొన్నకల్ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో, 21-01-2026 తేదీన ఫిర్యాదుదారురాలు బాలికతో కలిసి గూడూరు పోలీసు స్టేషన్‌కు వచ్చి రాతపూర్వక నివేదికను సమర్పించారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలం మరియు ఫిర్యాదు ఆధారంగా, ఈ కేసును ‘మిస్సింగ్ కేసు’ నుండి భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 87 r/w 3(5) మరియు పోక్సో చట్టం (POCSO Act) సెక్షన్ 3(a), 4 కిందకు మారుస్తూ తీవ్రమైన నేరంగా నమోదు చేయడం జరిగింది.
బాధితురాలిని తక్షణమే కోడుమూరు సి.హెచ్.సి (CHC) వైద్యుని వద్దకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించడమైనది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ (RFSL) కు పంపడం జరిగింది.
అదే విధంగా వన్ స్టాప్ సెంటర్ (One Stop Centre) లో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ ద్వారా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడం జరిగినది. అనంతరం గౌరవనీయ మెజిస్ట్రేట్ ఎదుట బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేయించడం జరిగింది.
బాలికకు మానసిక ధైర్యాన్ని అందించేందుకు మరియు కౌన్సెలింగ్ నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కి పంపడం జరిగింది.
దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన A1 ని అరెస్ట్ చేయడం జరిగినది. నిందితుడిని కర్నూలులోని గౌరవనీయ జె.ఎం.ఎఫ్.సి (JMFC) ప్రత్యేక మొబైల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది.
మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
~ఎస్.ఐ, గూడూరు PS
ఇద్దరు నిందితులు అరెస్టు… దొంగలించబడిన 11 బ్యాటరీలు స్వాధీనం.
ఇద్దరు నిందితులు అరెస్టు…దొంగలించబడిన 11 బ్యాటరీలు స్వాధీనం.
కిరణ్ 24×7 న్యూస్:
గత నెల రోజులుగా కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్, ఉద్యోగ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, ఎన్టీఆర్ బిల్డింగ్స్ తదితర ప్రాంతాలలో పార్కింగ్ చేసి ఉంచినటువంటి ఆటోలు, ట్రాక్టర్లు, జెసిబిలు, బోర్ వెల్ వాహనాలు కు అమర్చి నటువంటి బ్యాటరీలను దొంగతనం చేసుకువెళ్లారు .
అనేటువంటి ఫిర్యాదుల పైన నాలుగు పట్టణం పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు అయ్యాయి.
ఈ మూడు కేసులు లో దర్యాప్తులో భాగంగా లభించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన తర్వాత SI గోపినాథ్, SI శరత్ కుమార్, క్రైమ్ పార్టీ మురళి, సుబ్బరాయుడు, జీనస్ ల సహాయంతో కర్నూల్ పట్టణం చెంచు నగర్ కు చెందినటువంటి సుధాకర్ మరియు మహేంద్రలు బ్యాటరీలు దొంగిలించినట్టుగా తెలియ వచ్చింది. ఆ ఇద్దరి యొక్క కదలికలపై నిఘా ఆదివారం వారిని గుత్తి పెట్రోల్ బంకు వద్ద అరెస్టు చేసే విచారించగా వారు సుమారు 11 బ్యాటరీలను దొంగలిచ్చినట్టుగా ఒప్పుకుంటూ సదరు బ్యాటరీలను అమ్ముకొనడానికి వారి ఇంటి వెనకాల ఉన్నటువంటి షెడ్ లో దాచి ఉంచామని చెప్పగా వాటిని వారి సమక్షంలో సీజ్ చేయడం జరిగింది.
దొంగలించబడిన బ్యాటరీల విలువ సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది. వారి నుండి రికవరీ చేసిన బ్యాటరీలను సంబంధిత ఫిర్యాదుదారులకు అందజేయడం జరుగుతుంది . వీరిద్దరిని రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది..
.
ఈ సందర్భంగా కర్నూల్ నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహ మాట్లాడుతూ….
కర్నూలు నగరంలో గతకొన్ని రోజులుగా బ్యాటరీలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశామన్నారు. ట్రాక్టర్లు, జేసీబీలు, ఇన్వర్టర్స్ ల బ్యాటరీలు పోవడంతో భాదితులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న కర్నూల్ నాలుగో పట్ఞణ పోలీసులు ధర్యాఫ్తు చేయగా కర్నూలు కు చెందిన సుదాకర్(19) మహేంద్ర(19) దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్టు చేశామన్నారు.
వీరి నుంచి 11 బ్యాటరీలు పోలీసులు స్వాదీనం చేసుకున్నారన్నారు.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా?… విలువైన వస్తువులు లాకర్లలో భద్రపరుచుకోండి.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? .
విలువైన వస్తువులు లాకర్లలో భద్రపరుచుకోండి.
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .
కిరణ్ 24×7 న్యూస్:
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలవులలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు బుధవారం
జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు.
పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు వెళ్లే ముందు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు పాటించాలన్నారు.
పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందన్నారు.
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పండుగకు ఊరెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు.
ఇంట్లో ఎవరూ లేరని తెలియకుండా ఉండేందుకు రాత్రివేళ లైట్లు వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలి.
అపార్ట్మెంట్ల కాలనీ వాసులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. భద్రత మరింత మెరుగుపడుతుంది
ప్రయాణాల్లో జాగ్రత్త:
బస్సుల్లో ప్రయాణించేటప్పుడు విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ప్రయాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారం, పానీయాలను తిరస్కరించాలి.
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదన్నారు.
బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమన్నారు.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నివారించవచ్చని, తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చన్నారు.
నేరాల నివారణకు, అసాంఘిక శక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించడం ద్వారా సహకరించాలన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు , జిల్లా ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎక్కడైనా అనుమానితులు కన్పిస్తే , అత్యవసర సమయంలో వెంటనే డయల్ 112 కు గాని , డయల్ 100 కు ఫోన్ చేసి స్ధానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
ఈ సూచనలు దొంగతనాల వంటి నేరాలను అరికట్టి, పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి సహాయపడతాయని డిఐజి కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
10 లక్షల 33 వేల విలువ గల గంజాయి ధ్వంసం …
10 లక్షల 33 వేల విలువ గల గంజాయి ధ్వంసం …
అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా .
కిరణ్ 24×7 న్యూస్:
ఏపీ డిజిపి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పర్యవేక్షణలో మంగళవారం భారీగా గంజాయిని ధ్వంసం చేసి నిప్పు అంటించి తగలబెట్టారు.
ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా మాట్లాడుతూ…
కర్నూలు జిల్లా లోని వివిధ పోలీసుస్టేషన్ ల పరిధులలో 27 కేసులలో స్వాధీనం చేసుకున్న 126 కేజీ ల గంజాయిని కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న జిల్లా పోలీసు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ధ్వంసం చేశామన్నారు.

పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కోర్టు మెజిస్ట్రేట్ అనుమతితో , NDPS Act ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు.
దహనం చేసిన గంజాయి విలువ రూ. 10 లక్షల 33 వేలు ఉంటుందన్నారు.
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తో పాటు ఎక్సైజ్ అడిషనల్ ఎస్పీ సుధీర్ బాబు , కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, ఎక్సైజ్ డిఎస్పీ రామకృష్ణా రెడ్డి, నోడల్ ఆఫీసర్ సిఐ గుణశేఖర్ బాబు, సిఐలు తేజమూర్తి, విక్రమసింహ, శేషయ్య, నాగరాజారావు, ఇతర ఎస్సైలు పాల్గొన్నారు..

గూడూరులో గుర్తు తెలియని శవం లభ్యం..
గూడూరులో గుర్తు తెలియని శవం లభ్యం..
కిరణ్ 24 x 7 న్యూస్:
గూడూరు పట్టణంలోని నగర శివారులోని లచ్చమ్మ గుడి సమీపంలో కర్నూలు రహదారి వైపు పెద్ద కాలువ సమీపంలోని వ్యవసాయ భూమిలో ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని శవం లభ్యమయ్యింది.గత కొన్ని రోజులుగా దుర్వాసన వస్తుండడం గమనించిన రైతులు గుట్టు తెలియని శవాన్ని గుర్తించి వెంటనే గూడూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి..తహసిల్దార్
కిరణ్ 24x 7 న్యూస్:
కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి ఉత్తర్వుల మేరకు గూడూరు మండలంలో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా గూడూరు మండల తహసిల్దార్ వెంకటేష్ నాయక్ తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులలో చుక్కల భూములు, నిషేధిత భూములను క్రమబద్ధీకరించుటకు మరియు ప్రభుత్వ భూములుగా నమోదు అయినటువంటి పట్టా భూములకు క్రమబద్ధీకరించుటకు సంబంధిత రైతుల, ప్రజల నుండి అర్జీలను స్వీకరించుటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు గూడూరు తాసిల్దార్ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తామని అన్నారు. 26వ తేదీన గూడూరు మరియు గుడిపాడు గ్రామాలకు, 27వ తేదీన కే. నాగలాపురం బూడిదపాడు మరియు పెంచికలపాడు గ్రామాలకు, 28వ తేదీన చనుగొండ్ల మరియు ఆర్. ఖానాపురం గ్రామాలకు, 29వ తేదీన జూలకల్లు మరియు పొన్నకల్లు గ్రామాలకు, 30వ తేదీన మునగాల మరియు మల్లాపురం గ్రామాలలోని భూ సమస్యలపై అర్జీలను స్వీకరిస్తామని అన్నారు. రైతులు తమ అర్జీలను గూడూరు తహ సిల్దార్ కార్యాలయంలో అందజేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి.. గూడూరు తహసిల్దార్.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి..తహసిల్దార్
కిరణ్ 24x 7 న్యూస్:
కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి ఉత్తర్వుల మేరకు గూడూరు మండలంలో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా గూడూరు మండల తహసిల్దార్ వెంకటేష్ నాయక్ తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులలో చుక్కల భూములు, నిషేధిత భూములను క్రమబద్ధీకరించుటకు మరియు ప్రభుత్వ భూములుగా నమోదు అయినటువంటి పట్టా భూములకు క్రమబద్ధీకరించుటకు సంబంధిత రైతుల, ప్రజల నుండి అర్జీలను స్వీకరించుటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
- ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు గూడూరు తాసిల్దార్ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తామని అన్నారు.
- 26వ తేదీన గూడూరు మరియు గుడిపాడు గ్రామాలకు, 27వ తేదీన కే. నాగలాపురం బూడిదపాడు మరియు పెంచికలపాడు గ్రామాలకు,
- 28వ తేదీన చనుగొండ్ల మరియు ఆర్. ఖానాపురం గ్రామాలకు, 29వ తేదీన జూలకల్లు మరియు పొన్నకల్,
- 30వ తేదీన మునగాల మరియు మల్లాపురం గ్రామాలలోని భూ సమస్యలపై అర్జీలను స్వీకరిస్తామని అన్నారు.
- రైతులు తమ అర్జీలను గూడూరు తహ సిల్దార్ కార్యాలయంలో అందజేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
గూడూరు మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని గూడూరు మండల తహసిల్దార్ వెంకటేష్ నాయక్ ఈ సందర్భంగా తెలియజేశారు.
సారాయి తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు…
కిరణ్ 24 x 7 న్యూస్:
గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సారాయి తయారీ కేంద్రాలపై గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప ఆధ్వర్యంలో పోలీసులు సారాయి కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి సారాయి (అర్రాక్) నీ ధ్వంసం చేశారు. సారాయి కేంద్రాలలో సుమారుగా 300 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకుని నాశనం చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా సారాయిని తయారుచేసి విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప వెంట స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.
కర్నూలు జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ఎబిసిడి అవార్డు…
కర్నూలు జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ఎబిసిడి అవార్డు.
కిరణ్ 24×7 న్యూస్:
“అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ABCD)” అవార్డ్ సాధించిన కర్నూలు జిల్లా పోలీసులు.
రాష్ట్ర డిజిపి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న….
కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .
రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచడాన్ని గుర్తించి ప్రతిష్టాత్మకంగా ప్రతీ 3నెలలకు ఒకసారి ప్రకటించే “అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ABCD)” అవార్డ్ మొదటి క్వార్టర్ (జనవరి -మార్చి )2025 గాను ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎటిఎం దొంగతనం కేసును చేధించినందుకు గాను కర్నూలు జిల్లా పోలీసు విభాగం ఎంపిక అయింది.
డి.జి.పి ప్రధాన పోలీస్ కార్యాలయం మంగళగిరిలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐ.పీ.ఎస్., చేతుల మీదుగా కర్నూలు పోలీసులు ఎబిసిడి అవార్డు స్వీకరించారు.
జిల్లాలో జరిగిన ఎటిఎం దొంగతనం కేసును చేధించి చురుగ్గా వ్యవహారించిన పోలీసు అధికారులను అభినందించారు.
అవార్డులు పొందిన వారిలో కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ , కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబునాయుడు, ఉలిందకొండ ఎస్సై ధనుంజయ, ఓర్వకల్లు ఎస్సై సునీల్ మరియు సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ , కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ…
కర్నూలు జిల్లాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కేందుకు సదరు కేసును చేదించడంలో కృషి చేసిన అధికారులను మరియు సిబ్బందిని కర్నూలు రేంజ్ డిఐజి, కర్నూలు జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ అవార్డును స్ఫూర్తి గా తీసుకొని, జిల్లా వ్యాప్తంగా నమోదైన మరిన్ని కేసులను సమర్థవంతంగా చేదించేందుకు మరింత కృషి చేయాలని, జిల్లాకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలనిఆకాంక్షించారు.
జరిగినవిషయం..
కర్నూలు ఉలిందకొండ పోలీసుస్టేషన్ పరిధిలో ఏటీఎం మిషన్ల ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.
కర్నూలు పరిధిలో ఫిబ్రవరి 23,24 తేదీల్లో రెండు ఏటీఎం కేంద్రాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు.
ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్న టేకూర్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ఏటీయంను దొంగలు పెకలించి వాహనంలో తీసుకుని పోతుండగా స్థానిక యువకులు అనుమానించి వెంటబడ్డారు.
దీంతో దొంగలు వాహనాన్ని వదలి పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
పట్టుబడిన నలుగురు షాహీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, జంసాద్ ఖాన్, షావ్కర్ ఖాన్ వీరు లారీ డ్రైవర్లు గా పనిచేస్తు ఏటీయం మిషన్లను దొంగలించే ముఠాగా ఏర్పడ్డారని వివరించారు.
షాహిద్ ఖాన్ ముఖ్య నేరస్థుడిగా గుర్తించారు.
ఇతనిపై వివిధ రాష్ట్రాల్లో 26 ఏటీఎం దొంగతనాల కేసులు, మరో నిందితుడు ఇమ్రాన్ ఖాన్ పై 15 ఏటీఎం దొంగతనాల కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
ఏటీఎం దొంగతనం కోసం ఉపయోగించే సామాగ్రిని వారి నుంచి స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించారు.
గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా రాజా కుళ్లాయప్ప బాధ్యతల స్వీకరణ..
గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా రాజా కుళ్లాయప్ప బాధ్యతల స్వీకరణ..
కిరణ్ 24×7 న్యూస్:
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. రాజా కుళ్లాయప్ప , తన శిక్షణ పూర్తి చేసిన అనంతరం చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో పి.ఎస్.ఐగా విధులు నిర్వహించారు. అనంతరం పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ బదిలీపై గూడూరు పోలీస్ స్టేషన్‌కు ఎస్.హెచ్.ఓగా నియమితులై, బుధవారం 17.12.2025 అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా బి. రాజా కుళ్లాయప్ప మాట్లాడుతూ, గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సామాజిక వ్యతిరేక శక్తులు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు తక్షణమే తమ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే, ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదేవిధంగా, ప్రజలకు ఎలాంటి సమస్యలు, అన్యాయాలు జరిగినా, లేదా పోలీస్ సహాయం అవసరమైన సందర్భాలలో నేరుగా గూడూరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, ప్రజల హక్కుల పరిరక్షణకు మరియు న్యాయం అందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ప్రజల సహకారంతో గూడూరు పట్టణంలో శాంతి భద్రతలు మరింత మెరుగుపరచడం, నేరరహిత వాతావరణాన్ని నెలకొల్పడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పోలీస్ శాఖతో సమన్వయం కలిగి పనిచేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రంథాలయ స్థలం కబ్జా పై పోరాటం…
గ్రంథాలయ సంస్థ స్థలం కబ్జా పై పోరాటం ఆగదు.
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు.
కిరణ్ 24×7 న్యూస్:
కోడుమూరు పట్టణంలో ఉన్న గ్రంథాలయ సంస్థ స్థలం కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వక్తలు పేర్కొన్నారు. కోడుమూరు పట్టణంలో ఆదివారం ఉదయం యూత్ రిక్రియేషన్ సెంటర్ లో అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోడుమూరు గ్రంథాలయ సంస్థ స్థలం కబ్జా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ పట్టాలు సృష్టించుకొని లైబ్రరీ స్థలం కబ్జా చేస్తే పోరాటం చేయక తప్పదని వక్తలు పేర్కొన్నారు. దొంగ పట్టాలు సృష్టించుకొని గ్రంథాలయ స్థలం కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తుంటే కోడుమూరు గ్రామ పంచాయతీ ఏమి చేస్తోందని నిలదీశారు.

గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అన్ని తెలిసినా ఎందుకు మిన్నకుండ చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే గ్రామ పంచాయతీ కబ్జా చేస్తున్న వారికినోటిస్ లు ఇచ్చి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గ్రామ పంచాయతీ పాలక వర్గం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటి పన్నుతో పాటు గ్రంథాలయ పన్నును ప్రజలు గ్రామ పంచాయతీ కు చెల్లిస్తుంటే గ్రామ పంచాయతీ గ్రంథాలయ సంస్థ స్థలంలో అక్రమ కట్టడాలు జరుగుతుంటే గ్రామ పంచాయతీ నిద్ర పోతుందా అని నిలదీశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సోమవారం రాత్రి వరకు సమయం ఇచ్చి మంగళవారం నుండి అక్రమ నిర్మాణం పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సబ్యులు అభిప్రాయపడ్డారు.
మంగళవారం నుండి మన కోడుమూరు మన గ్రంథాలయం పేరుతో కోడుమూరు గ్రంథాలయ స్థలము ను పరిరక్షించుకుందామని వక్తలు సూచించారు. కావున సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణం ఆపాలని, ప్రభుత్వ స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు.

గూడూరులో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది హిందూ సమ్మేళనం…
గూడూరులో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది హిందూ సమ్మేళనం…
కిరణ్ 24×7 న్యూస్:
రాజకీయ–కుల భేదాలకు అతీతంగా 5,000 మందితో చారిత్రాత్మక సభ..
గూడూరు పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు, కులాలకు అతీతంగా దాదాపు 5,000 మంది హిందువులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడం గూడూరు చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా నిలిచింది.
ఈ సమ్మేళనానికి చిన్మయ మిషన్‌కు చెందిన పూజ్య మాతాజీ సుప్రేమానంద సరస్వతి, లలితా పీఠం పీఠాధిపతి శ్రీ మేడ సుభ్రమణ్య స్వామి , హనుమాన్ జంక్షన్ వ్యవస్థాపకులు గురు స్వామి రామాంజనేయులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. RSS దక్షిణ భారతదేశ ప్రముఖ్ శ్రీ భరత్ జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో మారెమ్మ గుడిలో ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. అనంతరం స్వామీజీలు, భక్తులు కలిసి పాదయాత్రగా సభా ప్రాంగణమైన తిమ్మగురుడు స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఈ పాదయాత్రలో చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సభలో స్వామీజీలు మాట్లాడుతూ, ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడులపై సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అలాగే ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలం, ఐక్యతకు మూలమని పిలుపునిచ్చారు.ప్రతి తల్లి తమ పిల్లలను ఛత్రపతి శివాజీ లాగా పెంచాలని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగమైన వివిధ కుల సంఘాల పెద్దలకు, భజన మండళ్లకు స్వామీజీల చేతుల మీదుగా సన్మాన సత్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డమం సురేష్, “ఇంత పెద్ద సంఖ్యలో హిందువులు ఐక్యంగా పాల్గొనడం గూడూరు చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజేష్, మల్లేష్ నాయుడు, పొన్నకల్ వెంకటేష్, శంకర్, రాము, ఆనంద్, భీమేష్, క్రిష్ణ, వీరన్న, తారక్, శివరాముడు,విగ్నేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొని కార్యక్రమ విజయానికి విశేషంగా తోడ్పడ్డారు.

రైతు సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు..
రైతు సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు
కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పట్టణంలో కెడీసీసీ బ్యాంకు ఆవరణలో సోమవారం రైతు సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనకు దిగారు.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కేడీసీసీ బ్యాంకు మేనేజర్ యూనిటీ మేడం మరియు గూడూరు సహకార సంఘం అధ్యక్షులు బి. దానమయ్య, సి.బెళగల్ సహకార సంఘం అధ్యక్షులు పోలకల్ అధ్యక్షులు ధనవంతు వీరి నిరసనకు మద్దతు నిస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు సహకార సంఘం అధ్యక్షులు దానమయ్య మాట్లాడుతూ జిల్లా చైర్మన్ మరియు నాయకులు డి.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించి సహకార సంఘం ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు తెలిపి వారి న్యాయమైన డిమాండ్ల సాధనకై సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు.

కేడీసీసీ బ్యాంకు మేనేజర్ యూనిటీ మేడం మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం సహకార సంఘం ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసనకు తాము మద్దతునిస్తున్నామని ప్రభుత్వం వారి డిమాండ్లను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గూడూరు మండల సహకార సంఘం సీఈవో శివకుమార్ రెడ్డి, సి.బెళగల్ సీఈవో ఎస్ ఖాజా హుస్సేన్, పోలకల్ సీఈఓ లక్ష్మన్న సిబ్బంది మధుసూదన్ రెడ్డి చంద్రశేఖర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు..

సహకార సంఘం ఉద్యోగుల డిమాండ్స్…రైతు సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు
* జి. ఓ నెం. 36 వెంటనే అమలుపరిచి, 2019 మరియు 2024 పెండింగ్ లో వున్న వేతన సవరణలు చేయాలి, అప్పటివరకు మధ్యంతర భృతి ఇవ్వాలి
* ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సిలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలి.
* సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి.
* ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య భీమాను కల్పించి, ఉద్యోగి సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారము లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇస్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి.
* అనేక సంఘాలలో ఉద్యోగుల జీతభధ్యలను డ్యూటు పద్దు నందు ఉంచడం జరిగింది, ఈ డ్యూటు పద్దులను రద్దు చెయ్యాలి.
* 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వారికి కూడా జి.ఓ నెం.36 అమలు పరచాలి.
* పి.ఏ.సి.ఎస్ ల ద్వారా కాకుండా, డి.సి.సి.బి ల ద్వారా రైతులకు డైరెక్ట్ గా ఋణాలు ఇస్తున్నారు. దీనివలన పి.ఏ.సి.ఎస్ నిర్వీర్యం అయిపోవీచున్నని. ఈ విధానాన్ని మార్పు చేసి అన్నీ సేవలు సహకార సంఘాల ద్వారా రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి.
* సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6% డివిడెంట్ లేదా కనీసం 6% వడ్డీ చెల్లించాలి. దీనిపై చర్యలు తీసుకోవాలి.
* సహకార సంఘాల సిబ్బంది బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. ఈ బదలీలు జరగాలంటే డి.ఎల్.ఎస్.ఎఫ్ ను అప్కాబ్, డిసీసీబీ లు, PACS లతో ఏర్పాటు చేసి 3 సువర్సరాల నిబందన కాకుండా నిరవదకంగా కొనసాగించి బదిలీలు చేయాలి.
* Capacity to pay నిభందనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలను DLSF ద్వారా నిరవధికంగా చెల్లించాలి.
* ప్రస్తుతము పనిచేయుచున్న Assistant Executives Clerks లేదా కంప్యూటర్ ఆపరేటర్ లను సీనియార్టీ ప్రాతిపదికిన జిల్లాలో ఖాళీగా ఉన్న సి.ఇ.ఓ పదవులను వీరితో భర్తీ చేసుకోవాలి.
* Assistant Executives DLEC ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి.
























