చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్
పత్రికా ప్రకటన (26.04.2024)
kiran24×7news ;
( ఆంధ్ర – తెలంగాణ బార్డర్ ) జిల్లా సరిహద్దు సుంకేశుల బార్డర్ చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు.ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కర్నూలు జిల్లా, గూడురు పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సుంకేశుల డ్యామ్ చెక్ పోస్టును జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు.
కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు, సెబ్ పోలీసులు, లోకల్ పోలీసులకు జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు చేశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆంధ్ర – తెలంగాణ బార్డర్ చెక్ పోస్టులలో ఓటర్ల ను ప్రభావితం చేసే నగదు , మద్యం అక్రమ రవాణా జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఎన్నికల నియమావళికి విరుధ్దంగా అక్రమంగా తరలించే నగదు , మద్యం, ఇతర కానుకల రవాణలను అరికట్టాలన్నారు.
సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు లభ్యమైతే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచించారు.చెక్ పోస్టులలో పకడ్బందీగా విధులు నిర్వహించాలి. ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి.పోలీసు అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున విధులు నిర్వహించే సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు..జిల్లా ఎస్పీ గారి తో స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస రెడ్డి, సెబ్ సిఐ మల్లిక, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ శ్యామల, గూడూరు ఎస్సై హనుమంతయ్య ఉన్నారు.
వైస్ చైర్మన్ అస్లాం గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యువకులు…
kiran24×7news ;
గూడూరు నగర పంచాయతీ పరిధిలో.. 19 వ వార్డు కౌన్సిలర్ ఖలీల్ మరియు వైసీపీ యువ నాయకులు చికెన్ వలి ఆధ్వర్యంలో పడమటి బీసీ కాలనీకి చెందిన యువకులు గురువారం గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ అస్లం గారిని రాయల్ బాయ్స్ యూత్ యువకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను ఘనంగా సన్మానించి తమ మద్దతును తెలిపారు..
ఈ కార్యక్రమంలో రాయల్ యూత్ నాయకులు సభ్యులు షేక్ ఖలీల్ మౌలాలి ముళ్ళ బాషా దూద్ వలి అబ్దుల్లా మొదలగు యువకులు పాల్గొన్నారు..
గుడిపాడులో వాలంటర్ల రాజీనామా…
kiran24×7news :
గూడూరు మండలంలోని గుడిపాడు గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 14 మంది వాలంటీర్లు గురువారం తమ విధులకు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ తమ రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో జయశ్రీ గారికి అందజేశారు.. సచివాలయంలో పనిచేస్తున్న (సురేష్, ప్రకాష్,ప్రసాద్,విజయ భాస్కర్,స్వామీదేవి,స్వర్ణ కుమారి) మరి కొంతమంది వాలంటీర్లు రాజీనామ చేసి తమ ముకుమ్మడి రాజీనామా పత్రాలను ఎంపీడీవో జయశ్రీ గారికి అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి కొంతమంది వాలంటీర్లు కూడా తమ విధులకు రాజీనామా చేసి త్వరలోనే తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో గారికి అందజేస్తారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు…
గూడూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ
kiran24×7news :
గూడూరు పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలోిని విద్యార్థినిలు 10 మరియు ఇంటర్ పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి మండలంలోని పాఠశాలకు మంచి గుర్తింపును తీసుకొని వచ్చారు. పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్పులు సాధించి పాఠశాలకు మంచి ఖ్యాతిని తీసుకువచ్చిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
ఎం స్వాతి 535 మార్కులతో పాఠశాల మొదటి స్థానంలో నిలిచింది. యు. అఖిలాండేశ్వరి 443 మార్కులతో రెండవ స్థానంలో ఆర్. సువేదమ్మ 437 మార్కులతో మూడవ స్థానంలో బి. అశ్విని 432 మార్కులతో నాలుగవ స్థానంలో మరియు యు. మేఘన 428 మార్కులతో 5వ స్థానంలో నందిని 406 యూ. భవ్య 406 మార్కులతో మార్కులతో టాపర్లుగా నిలిచారు.
గూడూరులో 20 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా..
kiran24×7news ;
కోడుమూరు నియోజకవర్గంలో గూడూరు నగర పంచాయతీకి లో వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న 20 మంది వాలంటీర్లు బుధవారం తమ విధులకు రాజీనామా చేస్తున్నట్లుగా మూకుమ్మడిగా కలిసి కమిషనర్ కు తమ రాజీనామా పత్రాలను అందజేశారు.. తమ వ్యక్తిగత కారణాలవల్ల వాలంటీర్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని మా రాజీనామా ను ఆమోదించాలని నగర పంచాయతీ కమిషనర్ను వారు కోరారు…
మొత్తం 20 మంది వాలంటీర్లు గూడూరు నగర పంచాయతీలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి గారికి తమ రాజీనామా పత్రాలను అందజేయడం జరిగింది. 1th సచివాలయంలో ఆరుగురు, 6th సచివాలయంలో ముగ్గురు, షేక్ రేష్మ, D.S. అలీమ్, కుమ్మరి శేఖర్, 4th సచివాలయంలో ముగ్గురు, 2th సచివాలయంలో ముగ్గురు, 4th సచివాలయంలో ఇద్దరు తమ వాలంటీర్ విధులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
ప్రజలు స్వేచ్ఛగా , నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి… జిల్లా ఎస్పీ
kiran24x7news;
ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు.
ఇందులో భాగంగా సి. బెలగళ్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలైనా పోలకల్ గ్రామం, గొల్లల దొడ్డి గ్రామాలను సందర్శించి జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు పరిశీలించారు.అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
పోలీంగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి అక్కడి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస రెడ్డి, సి. బెలగళ్ పోలీసుస్టేషన్ ఎస్సై తిమ్మా రెడ్డి ఉన్నారు.
నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి…
నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కోడుమూరు వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి..
kiran24x7:
ప్రజలందరి ఆశీస్సులతో వైయస్ఆర్ సీపీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి – *డాక్టర్ ఆదిమూలపు సతీష్* గారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కావున కోడుమూరు నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యగలరని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పిలుపునిచ్చారు
తేది:19.4.2024 శుక్రవారంసమయం:ఉదయం10:30కి*స్థలం: ఆర్డిఓ కార్యాలయం కర్నూలు…ఉదయం 10 గంటలకు చిల్డ్రన్స్ పార్క్ (SV కాంప్లెక్స్) దగ్గరకు అభిమానులు కార్యకర్తలు పార్టీ నేతలు రావాలని కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కోరారు…
కోడుమూరు వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో టిడిపి నుండి వైసీపీలోకి భారీ చేరికలు…
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు మండలం ఈ తాండ్రపాడు, గొందిపర్ల, రేమట, కర్నూల్ పట్టణ 38వ వార్డు గీత ముఖర్జీ నగర్ కు చెందిన టిడిపి కార్యకర్తలు ఈరోజు వైసిపి పార్టీలోకి చేరారు..
వీరికి కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు సమక్షంలో కర్నూల్ పార్లమెంట్ టిడిపి మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ సాహెబ్, కర్నూల్ మండల టిడిపి కన్వీనర్ బి.శివ శంకర్ నాయుడు, గీత కార్మికుల ఆర్గనైజింగ్ సెక్రటరీ యూనిట్ ఇంచార్జ్ ఈ.సురేంద్ర గౌడ్, కొంతలపాడు బూత్ ఇంచార్జ్ బి నారాయణ, ఎస్సీ సెల్ మండల కార్యదర్శి బి. శ్రీనివాసులు, రేమట ఎస్.మాభాషా, ఇ.తాండ్రపాడు మియ్యషా ఖాద్రీ, కర్నూల్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం నిజాముద్దీన్, ఇ.తాండ్రపాడు ఎం.లక్ష్మన్న, రేమట బి.దేవన్న, బి.శివాంజనేయులు, బి.మల్లికార్జున్, బి.రంగడు, ఇ.తాండ్రపాడు ఎం మదర్ సాహెబ్ గార్లకు పార్టీ కండువా కప్పి వైసిపి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఆకర్షితులమై పార్టీలోకి చేరినట్లు తెలిపారు అదేవిధంగా రానున్నది జగనన్న ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. అలాగే కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బి వై రామయ్య గార్లను అధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా అందిస్తామని తెలిపారు..
కార్యక్రమంలో కర్నూల్ పట్టణ 40 వార్డు కార్పొరేటర్ విక్రమ్ సింహా రెడ్డి, గొందిపర్ల సర్పంచ్ శ్రీనివాసులు, బోయ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే పోలీసుల కవాతు…. గూడూరు యస్ ఐ హనుమంతయ్య..
kiran24×7news : గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగాల, మల్లాపురం గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు. 
ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో పోలీసులు కవాతు నిర్వహించామని గూడూరు యస్ ఐ హనుమంతయ్య తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల (“సశస్త్ర సీమా బల్”) పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు గూడూరు యస్ ఐ విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణ మద్యం పట్టివేత, కేసు నమోదు
kiran24x7news:
కర్నూలు జిల్లా, సి. బెలగల్ మండలంలోని గుండ్రేవుల గ్రామములో సెబ్ పోలీసులు జరిపిన దాడులలో బోయ రామాంజనేయులు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 34 మద్యము బాటిళ్లు మోటారు వాహనంలో రవాణా చేస్తుండగా మోటార్ సైకిల్, మద్యము సీజ్ చేసి, కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ దాడులలో సి.ఐ రామాంజనేయులు, ఎస్.ఐ అలీబేగ్, హేడ్ కానిస్టేబుల్ హనుమంతు, కానిస్టేబుళ్లు అన్సార్ బాషా, వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు..
వర్కూరులో గడ్డివామి దగ్ధం
kiran24×7news : కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో రామకృష్ణ అనే రైతు గడ్డివామి శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. సమాచారం తెలిసిన వెంటనే కోడుమూరు అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలు ఆర్పి వేసేందుకు ప్రయత్నించారు.. పక్కనే ఉన్న రైతులు గడ్డివామి మంటలను ఆర్పి వేసేందుకు శతవిధాల ప్రయత్నించారు.
దాదాపుగా గడ్డివామి మంటలకు కాలి బూడిదైంది. ప్రభుత్వం తరఫున రైతుకు పరిహారం అందించాలని బాధిత రైతు రామకృష్ణ ఆయన కుటుంబీకులు కోరుతున్నారు.
నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ కు తప్పిన ప్రమాదం..
kiran24×7news : పాణ్యం మండలం తమ్మరాజు పల్లి గ్రామం వద్ద నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ కు తప్పిన ప్రమాదం..
కర్నూలుకు వెళుతుండగా బర్రెలను ఢీకొన్న కారు.కారు బెలూన్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఫారుక్, సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలంకు పాణ్యం ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి గౌరు చరిత రెడ్డి చెరుకుని ఫరూఖ్ ను నంద్యాల లోని ఒక ప్రవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి వెంట ఉండి,ఇంకో వాహనం లో పంపించడం జరిగింది.
ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరికి మద్దతు తెలిపిన గూడూరు పట్టణ అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు..
ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి మద్దతు తెలిపిన పట్టణ అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు..
kiran24×7news:-
కోడుమూరు నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకులు డి,విష్ణువర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి నివాసంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొగ్గుల దస్తగిరి గారికీ మద్దతు తెలిపిన గూడూరు పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు క్లస్టర్ 8 ఇంచార్జి,మరియూ పార్టి అధికార ప్రతినిధి దండు సుందర్ రాజు మరియు స్థానిక టిడిపి నాయకులు నేతలు కార్యకర్తలు..
బుధవారం గూడూరు పట్టణం నుండి పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక నేతలు కార్యకర్తలు కర్నూల్ లోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఎమ్మెల్యే అభ్యర్థికి తమ మద్దతును ప్రకటించారు. జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని పూలమాలతో సత్కరించి సన్మానించారు. ఎన్నికల్లో తమ వంతు కృషిచేసి అత్యధిక మెజార్టీని సాధించేలా పోరాడుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 40 యూనిట్ ఇంచార్జి,మునెమ్మ, 41 యూనిట్ ఇంచార్జి,మల్లేపోగు మిన్నెళ్ళ, 42 యూనిట్ ఇంచార్జి, బీ,సుమన్ బాబు, 35 యూనిట్ ఇంచార్జి(గూడూరు మండలం తెలుగు యూత్ ప్రసిడెంట్),పార్లమెంట్ బీసీ సెల్ కార్యదర్శి నగప్ప యాదవ్,నియోజకవర్గ SC సెల్ ఆర్గనైజర్ దుర్గ సమెల్,గూడూరు పట్టణ ఉప అధ్యక్షులు రవి,14 వార్డు కౌన్సిలర్ కుమ్మరి ఎల్లయ్య,మాజీ కౌన్సిలర్,టీడీపీ నాయకులు కే, వెంకటరాములు, నాయకులు రామాంజనేయులు, డి.పెద్ద రంగడు, కె.సుంకన్నా తదితరలు.. బూత్ ఇంచార్జిలు ప్రసాద్. నాగరత్నారావు.K.ఎల్లయ్య.S. సులేమాన్ఇడిగా గిడ్డయ్య. మహబూబ్ బీ. చదువన్న గురు.K. రఘు బాబు. K. దివ్య రాణి.మన్నన్ భాష. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పోలీస్ స్టేషన్ నుండి నలుగురు కానిస్టేబుళ్ల బదిలీ
గూడూరు పోలీస్ స్టేషన్ నుండి నలుగురు కానిస్టేబుళ్ల బదిలీ…
kiran24×7news :-
పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ మధుశేఖర్, సునీత, లోకేశ్, మధుగోపాలను ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు. వీరంతా సొంత మండలమైన గూడూరు మండలానికి చెందిన వారు కావడం గమనార్హం. ఎన్నికల నిబంధనల మేరకు సొంత నియోజకవర్గంలో విధులు నిర్వహించకూడదన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఐపీఎస్ ఆ నలుగురు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రిలీవ్ చేసినట్లు గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంతయ్య ఈ సందర్భంగా తెలిపారు.
టిడిపి పార్టీ మండల అధ్యక్షులను మార్పు చేయలేదు….
టిడిపి పార్టీ మండల అధ్యక్షులను మార్పు చేయలేదు….
టిడిపి పార్టీ కోడుమూరు నియోజకవర్గం లోని మండల అధ్యక్షులను వారి పదవులను ఎలాంటి మార్పులు చేయలేదని టిడిపి పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బిటి నాయుడు ప్రకటనను విడుదల చేశారు..
కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ గూడూరు, సి.బెళగల్, కర్నూలు మండలముల పార్టీ అధ్యక్షులను మార్పు చేయలేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు బీ.టి.నాయుడు
కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరు, సి.బెళగల్, కర్నూలు మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులను మార్పు చేసినట్టుగా నిన్నటి దినం దినపత్రికలలోను, సోషల్ మీడియాలోను ప్రచ్రితమైనట్లు రాష్ట్ర పార్టీ దృష్టికి సమాచారం తెలిసినందున ఈ అంశం గురించి పూర్తిగా తెలుసుకునే నిమిత్తం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ.॥ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పూర్తి స్థాయి. సమాచారమును తెలియజేయవలసిందిగా జిల్లా పార్టీని ఆదేశినందున ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయం, కర్నూలు నందు పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ బీ.టి.నాయుడు, జోన్ 5 కో ఆర్డినేటర్ శ్రీ బీద రవిచంద్రయాదవ్, యం.యల్.సి శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మరియు కోడుమూరు నియోజకవర్గం పార్టీ పరిశీలకులు శ్రీనివాస మూర్తి గార్లు ఈ విషయమై పూర్తిగా సమాచారమును సేకరించడం జరిగింది. ఈ విధంగా మార్పులు చేయడం పార్టీ నియాపలికి విరుద్ధం అవుతుంది. ఈ మండలాలకు సంబందించిన కర్నూలు మండలం పార్టీ అధ్యక్షులు శ్రీ శివశంకర్ నాయుడు, గూడూరు మండలం పార్టీ అధ్యక్షులు శ్రీ సుధాకర్ రెడ్డి, సి.బెళగల్ మండలం పార్టీ అధ్యక్షులు శ్రీ గోవింద్ గౌడ్ గార్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారని తెలియజేశారు. పత్రికలలోనూ, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లకు జిల్లా పార్టీకి ఏ విధమైన సంభందం లేదని తెలిపారు.
24014/24
బీ.టి.నాయుడు
యం.యల్.సి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు.
భారీ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న మురళీకృష్ణ అభిమానులు ..
గూడూరు నగర పంచాయతీలో సంబరాలు చేసుకున్న Muralikrishna Parigela అన్న గారి అభిమానులు..
ఈరోజు కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని ఖరారు చేసిన సందర్భంగా స్థానిక మురళీకృష్ణ అభిమానులు భారీ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు..
త్రాగునీటిని సరఫరా చేసే ‘ఎల్ఎల్ సి’కాలువని మట్టితో కప్పేశారు..
అధికారుల నిర్లక్ష్యం… ఇష్టానుసారంగా ప్రైవేటు సంస్థ వ్యవహారం.
kiran24×7news..
సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు లేకపోవడంతో కర్నూలు నగరానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా అధికారులు త్రాగునీటి అవసరాల నిమిత్తం గాజులదిన్నె జలాశయం నుండి త్రాగునీటిని ఎల్ఎల్ సి కాలువ ద్వారా కర్నూల్ నగరానికి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఓ ప్రైవేటు సంస్థ ..(గ్రీన్ కో సంస్థ) వారు గాలి మరలను ఏర్పాటు చేసేందుకు గాను తమ వాహనాల రాకపోకలకు వీలుగా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలోని ఎల్ఎల్ సి కాలువ లో రెండు చిన్న సైజు పైపులను ఏర్పాటు చేసి కాలువపై మొత్తం మట్టితో కప్పి వేసి రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అధికారులు గాజులదిన్నె జలాశయం నుండి విడుదల చేసిన నీరంతా చనుగుండ్ల గ్రామంలోని ఎల్ఎల్సీ కాల్వలోనె నిలిచిపోయే దుస్థితి ఏర్పడింది. ఈ ప్రైవేటు సంస్థ వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరాను ఏకంగా మట్టితో కప్పేసి తమ వ్యవహారాలు నడిపిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.. గత కొన్ని రోజుల క్రితమే పెంచికలపాడు చెరువును ఆక్రమించి చెరువుకు సంబంధించిన కరకట్టలను తొలగించి తమ వాహనాల రాకపోకలకు వీలుగా ఈ ప్రైవేటు సంస్థ వారు రహదారి వేసుకోవడంతో స్పందించిన సిపిఐ సిపిఎం నాయకులు గ్రామ ప్రజలతో కలిసి ఆందోళనలు చేసి వారి ఆట కట్టించి చెరువును యధా స్థితికి తీసుకువచ్చారు.. ఓ ప్రైవేటు సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అధికారులకు ముడుపులు బాగా ముట్టాయేమో!!! అందుకే వారి ఆగడాలను అడ్డుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రైవేట్ సంస్థ ఆగడాలను అరికట్టకపోతే కాలువలు చెరువులు మరియు కల్వర్టులు అన్ని తుడుచుకుపోయే పరిస్థితి లేకపోలేదు..
ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే పోలీసుల కవాతు….
కర్నూలు జిల్లా…
• జిల్లాలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు.
kiran24×7news :-
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహిస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు.
ఈ రోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు
జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ సబ్ డివిజన్ లలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్” సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు.
గూడూరు పోలీసుస్టేషన్ పరిధిలోని సుంకేశుల, ఆర్ . ఖానా పురం , రేమట గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో కోడుమూరు సిఐ మనసురుద్దీన్ , గూడూరు ఎస్సై హనుమంతయ్య మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.
హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని సిద్దాపురం, అమృతపురం, వల్లూరు గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.హాలహార్వి ఎస్సై నరేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఆదోని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీనివాస భవన్, ఖాజీపుర, ఎన్ టిఆర్ కాలనీ, టిజిఎల్ కాలనీ, పెద్దమసీదు, మరాఠీ గేరి, బబ్బులమ్మాగుడి, బోయగేరి కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.ఆదోని ఒన్ టౌన్ సిఐ తేజ మూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వైసిపి పార్టీ నుండి టిడిపి పార్టీలోకి చేరిక
వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిక.
kiran24×7news …

_▪️కోడుమూరు నియోజకవర్గ బెలగల్ మండలం వీరన్న గౌడ్,పొలకల్ తిమ్మప్ప గారి అధ్వర్యంలో ఎనగండ్ల గ్రామానికి చెందిన 50 కుటుంబాలు తిమ్మప్ప గారి చంద్రశేకర్ మాజీ జెడ్పీటీసీ అధ్వర్యంలో వైసిపి నాయకులు కార్యకర్తలు కర్నూల్ లోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు._
_▪️ ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు._
_▪️టీడీపీలోకి చేరినవారు ఎంపీటీసీ తిమ్మలమ్మ,ఉప సర్పంచ్ గిడ్డయ్య,స్కూల్ ఛైర్మెన్ కిషోర్,3వ వార్డు సభ్యులు నాగరాజు,2వ వార్డు సభ్యులు కృష్ణయ్య,4వ వార్డు మహేశ్వరమ్మ,1వ వార్డు సభ్యులు ఆంజనేయులు,CH. వెంకటేష్,కుమార్,నాగరాజు,మురళి,గురుస్వామి,శంకర్ గౌడ్ ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

























