నకిలీ కాల్స్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… జిల్లా ఎస్పీ…

నకిలీ కాల్స్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.

 

కిరణ్ 24×7 న్యూస్:

ఇటీవల క్రెడిట్ కార్డు యజమానులు తమ లిమిట్ పెంచుతామని చెప్పి ఫోన్‌లో ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు అడిగే కాల్స్ వస్తున్నాయని వీటి వల్ల భారీగా నష్టాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ఆదివారం తెలిపారు.

జిల్లా ఎస్పీ గారు జిల్లా ప్రజలకు పలు జాగ్రత్తలు చేశారు.

• వాస్తవికంగా బ్యాంకులు ఎప్పుడు కూడా ఓటీపీ, పాస్‌వర్డ్, సీవీవీ వంటి వివరాలు ఫోన్‌ లో అడగరని గుర్తుంచుకోవాలి.
• గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే లిమిట్ పెంపు, కార్డ్ అప్‌ గ్రేడ్ అంటూ వచ్చే కాల్స్ కి స్పందించకండి.

• ఎలాంటి లింక్‌లు, అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేయొద్దు. అవి మోసపూరితమైనవి కావచ్చు.

• ఎవరికి వారి బ్యాంక్ డిటైల్స్, ఓటీపీ, సీవీవీ గురించి చెప్పకండి.

• అనుమానాస్పదమైన కాల్ వచ్చినట్లయితే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయండి లేదా మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కి సంప్రదించాలి.

ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి

అదేవిధంగా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.

ఈ తరహా మోసాలను నివారించడానికి , అనుమానాస్పదమైన కాల్స్ వచ్చినప్పుడు వెంటనే కాల్ కట్ చేయండి మరియు అధికారిక మార్గాల్లో మాత్రమే బ్యాంక్ సేవలు ఉపయోగించుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు…

 

* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.

* చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

కిరణ్ 24×7 న్యూస్:

కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

బాలింత మృతి.. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన..

బాలింత మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

కిరణ్ 24×7 న్యూస్:

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి అంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ..
—- బాలింత మృతి పై ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు

గూడూరు మండలంలోని పెంచికలపాడు విశ్వ భారతి ఆసుపత్రిలో బాలింత వెంకటలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహించి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు.

సంఘటనకు సంబంధించి సి. బెళగల్ మండలంలోని కె. సింగవరం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని రెండేళ్ల కిందట కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించారు.

వెంకటలక్ష్మికి తొలి ప్రసవం కావడంతో పుట్టినిల్లు అయిన కె సింగవరం గ్రామానికి రావడం జరిగింది. రెండు రోజుల కిందట ప్రసవం కొరకు పెంచికలపాడు లోని విశ్వ భారతి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లి చేర్పించారు. గురువారం వైద్యులు వెంకటలక్ష్మికి సిజేరియన్ చేయడంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత వెంకటలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు మరో మారు వైద్యం నిర్వహించారు. అయినప్పటికీ బాలింత తీవ్ర అస్వస్థకు గురై కోలుకోలేక మృతి చెందింది. తమ బిడ్డకు వైద్యులు సరైన వైద్యం చేయకపోవడం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు కుటుంబ సభ్యులకు దిగారు. వెంకటలక్ష్మి మృతిచెందరం పట్ల వైద్యుల నిర్లక్ష్యం ఉందంటూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీస్ స్టేషన్ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి సిబ్బందితో ఆసుపత్రికి చేరుకొని వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  ఆదేశాలతో బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు.

 

* జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  ఆదేశాలతో బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు.

* రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.

కిరణ్ 24×7 న్యూస్:

కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్  పాటిల్ ఐపియస్  ఆదేశాల మేరకు ప్రైవేట్ , ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు , జాగ్రత్తలు పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. అవి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు కర్నూలు పోలీసులు భారీ వాహానాలకు “స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జిల్లా లో ఆదోని, పత్తికోండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ లలో మరియు హైదరాబాద్- బెంగుళూరు, హైదరాబాద్ – చైన్నె ల నేషనల్ హైవే – 40, నేషనల్ హైవే – 44 ల లో లారీలు, ప్రవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసి బస్సులు , కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరోలను పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.

వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డ్రైవర్లకు గుర్తు చేస్తున్నారు.

వాహనాలను అతి వేగంతో నడపకుండా, రాంగ్ రూట్ లో వెళ్ళకుండా, పరిమితికి మించి ప్రయాణీకులకు ఎక్కించుకునే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలియజేశారు.

అంగన్వాడీ టీచర్ ను విధుల నుండి తొలగించాలని ఆదేశాలిచ్చిన జిల్లా కలెక్టర్..

 

సక్రమంగా విధులను నిర్వహించని అంగన్వాడీ టీచర్ ఫాతిమా ను విధుల నుండి తొలగించాలని ఆదేశాలిచ్చిన జిల్లా కలెక్టర్..

కిరణ్ 24×7 న్యూస్:

కోడుమూరు మండలం అంగన్వాడీ కేంద్రం పని తీరు పట్ల జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..సక్రమంగా విధులను నిర్వహించని అంగన్వాడీ టీచర్ ఫాతిమా ను విధుల నుండి తొలగించాలని కలెక్టర్ ఐసీడీఎస్ పిడి విజయను ఆదేశించారు..

బుధవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్ , పిల్లలకు అందిస్తున్న పాలు, గుడ్లు తదితర పదార్థాలను, రిజిస్టర్ లను పరిశీలించారు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ రిజిస్టర్లను పరిశీలించి, అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పదార్థాల స్టాక్ కు, రిజిస్టర్ లకు పొంతన కుదరకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్ లో 1309 గుడ్లు స్టాక్ ఉన్నాయని, మిగిలినవి గర్భవతులకు పంపిణీ చేసినట్లు ఉండగా, ఫిజికల్ గా కేంద్రంలో 1584 గుడ్లు ఉన్నాయని గుర్తించారు. గత నెల 3 వ వారం, 4 వ వారం లో వచ్చిన గుడ్లను పూర్తి స్థాయిలో టేక్ హోమ్ రేషన్ కింద గర్భిణి, బాలింతలకు పంపిణీ చేయకుండా ఎందుకు అలాగే నిల్వ ఉంచారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ ను ప్రశ్నించారు..

టేక్ హోమ్ రేషన్ రిజిస్టర్ కూడా సక్రమంగా మెయింటైన్ చేయకుండా ఉన్నారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ పని తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు…అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలిస్తూ, పిల్లలు హాజరుకానప్పటికీ 100 శాతం అటెండెన్స్ వేశారని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రీ స్కూల్ కిట్స్ ను చూసి, వాటిని వాడనట్లు కలెక్టర్ గుర్తించారు. పిల్లలు యాక్టివ్ గా లేరని కనీసం ఏ, బి, సి, లు కూడా చెప్పలేకపోతున్నారని, పిల్లలకు ఏమి పాఠాలు నేర్పిస్తున్నారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ ను ప్రశ్నించారు.. పిల్లలతో ఏమీ రాయించకుండా పిల్లలకి ఏమి పాఠాలు చెప్తున్నారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ పని తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు..

వయస్సు కు తగిన ఎత్తు, బరువు లేని పిల్లలు ఎంత మంది ఉన్నారని, సంబంధిత రిజిస్టర్ చూపించాలని కలెక్టర్ అంగన్వాడి టీచర్ ను ఆదేశించగా, సంబంధిత రిజిస్టర్ మెయింటైన్ చేయకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు… సక్రమంగా విధులను నిర్వహించని అంగన్వాడీ టీచర్ ఫాతిమా ను విధుల నుండి తొలగించాలని కలెక్టర్ ఐసీడీఎస్ పిడి విజయను ఆదేశించారు..

అంగన్వాడి సూపర్వైజర్ లు వెరిఫై చేయకుండా ఏమి చేస్తున్నారని అంగన్వాడి సూపర్వైజర్ కి నోటీస్ ఇవ్వాలని కలెక్టర్ ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు..అంగన్వాడి కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ వైద్యశాలలను తహసిల్దార్ లు, ఎంపిడిఓ లు ఖచ్చితంగా సందర్శించాలని కలెక్టర్ ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపిడిఓ లను ఆదేశించారు…

కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ, తహసిల్దార్ నాగరాజు, సిడిపిఓ వరలక్ష్మి, సూపర్వైజర్, ఎంపిడిఓ తదితరులు పాల్గొన్నారు..

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి..

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల మృతి..

కిరణ్ 24×7 న్యూస్: కర్నూలు లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు యువకులు మరణించగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు సంతోష్ నగర్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వస్తున్న సమయంలో టిప్పర్ బైక్ రెండు ఢీకొని ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఈప్రమాదంలో కోడుమూరు నియోజకవర్గం గూడూరు కు చెందిన చంద్రశేఖర్ (31) నవీన్(32) అక్కడికక్కడే మృతి చెందగా సుమన్(32) తీవ్ర గాయాలు అయ్యాయి. సుమన్ ను చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్ధాలానికి ట్రాఫిక్ పోలీసులు, నాలుగో పట్టణ పోలీసులు వెంటనే చేరుకోని సహయక చర్యలు చేపట్టారు. ఈప్రమాదం సందర్భంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ధర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రౌడీ షీటర్ లను నగర వీధుల్లో ఊరేగింపు…

*రౌడీ షీటర్ లను  నగర వీధుల్లో ఊరేగింపు…*

కిరణ్ 24×7 న్యూస్:

నెల్లూరు విఆర్సి సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు రౌడీ షీటర్లను నడిపించిన పోలీసులు… నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత పట్టణంలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఎలాంటి దౌర్జన్యాలకు ఆక్రమణలకు పాల్పడరాదంటూ హెచ్చరింపులు చేసి వారిని క్రమశిక్షణతో ఉండాలంటూ హెచ్చరించారు.

ప్రజలపై ఎలాంటి దౌర్జన్యాలకు దోపిడీలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. పట్టణంలోని పురవీధుల గుండా వారిని నడిపించి క్రమశిక్షణతో ఉండాలంటూ తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ చేపట్టిన చర్యలకు జిల్లా ఎస్పీ అజిత పై జిల్లా వ్యప్తంగా ప్రజలు ప్రశంసలు కురిపించారు. జిల్లా ఎస్పీ చేపట్టిన చర్యలకు

ఇప్పటి వరకు నెల్లూరు పోలీసు ఓ ఎత్తు.. ఇక పై మరో ఎత్తు.. అన్న చందంగా ప్రజలు చర్చించుకుంటున్నారు….

ఈ ఒక్క చర్యతో జిల్లా లో నేరగాళ్ళు, రౌడీలు, గూండాల గుండెల్లో గుబులు మొదలైంది..

ఇప్పటి వరకు నేరగాళ్లకు వార్నింగ్, కౌన్సిలింగ్ లే ఇక కర్ర క్యారియింగ్ లే.. పోలీసు కోటింగ్ లే. అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

నెల్లూరు లో నేరగాళ్ళు కత్తి వదిలేయండి లేకుంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటూ నెల్లూరు జిల్లా చరిత్రలో గుర్తుండి పోయే రోజు అని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు.

 

చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు.

కిరణ్ 24 x7 న్యూస్:

నిందితుడి నుండి 9 లక్షల 25 వేల విలువ గల
(9 తులాల బంగారు ఆభరణాలు ,
55 తులాల వెండి , ఒక లక్ష రూపాయల నగదు) ప్రాపర్టీ రికవరీ స్వాధీనం.

కర్నూల్ డిఎస్పి కార్యాలయంలో వివరాలు వెల్లడించిన… కర్నూల్ డిఎస్పీ బాబు ప్రసాద్.


కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, కర్నూలు డిఎస్పి బాబు ప్రసాద్  పర్యవేక్షణలో కోడుమూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ తబ్రేజ్  మరియు సి . బెళగల్ పోలీస్ స్టేషన్ ఎస్సై యు.. వేణు గోపాల్ రాజు  ఆధ్వర్యంలో, ఎఎస్సైలు నాగయ్య , హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుల్ లు మల్లికార్జున, సుధాకర్, భాస్కర్, సుధర్శన్ మరియు సత్యరాజు లు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు.

క్రైమ్ నెం. 155/2025 పై దర్యాప్తు ను కొనసాగించగా నేరముకు పాల్పడిన నిందితుడు గా ఉన్న గిర్నీ వెంకటేష్,( 45 సం లు) తండ్రి తిమ్మన్న తిమ్మం దొడ్డి గ్రామం, సి బెళగల్ మండలం.

నేరానికి పాల్పడినటువంటి ముద్దాయి అయిన గిరిని వెంకటేష్ ని ఈరోజు ఉదయము 11 గంటల సమయంలో సి.బెళగల్ గ్రామం నుండి చింతామానుపల్లి గ్రామునకు పోవు దారిలో ఉన్న గుట్టల నాగమ్మ గుడి వద్ద సి.బెళగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కర్నూల్ డిఎస్పీ బాబు ప్రసాద్  నిందితుని వివరాలను కర్నూల్ డీఎస్పీ కార్యాలయంలో వెల్లడిస్తూ మాట్లాడారు…

సి. బెళగల్ పోలీసుస్టేషన్ పరిధిలోని తిమ్మందొడ్డి గ్రామంలో సెప్టెంబర్ 25 న దొంగతనం జరిగిందని తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన తెలుగు చిన్న రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు దొంగతనాల కేసులు, ప్రాపర్టీ కేసులలో దర్యాప్తులు వేగవంతం చేయడం జరిగిందన్నారు.

పాతనేరస్తులను విచారణ చేయడం , సిసి కెమెరాల పుటేజిలను వర్క్ ఔట్ చేయడంతో ఈ నిందితుడి గుర్తించి పట్టుకున్నామన్నారు.

సి. బెలగల్ మండలం, తిమ్మం దొడ్డి గ్రామానికి చెందిన గిర్ని వెంకటేష్ (45) నుండి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు , సుమారు 55 తులాల వెండి , లక్ష రూపాయల నగదు స్వాధీనపరచుకుని అరెస్ట్ చేయడమైనదన్నారు.

రికవరి చేసిన ప్రాపర్టీ ని సంబంధిత యజమానులకు కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుందన్నారు.

ముద్దాయిని ఈ రోజు రిమాండు కు పంపించడం జరుగుతుందన్నారు.

ఇతని పై ఏమైనా పాత కేసులు ఉన్నాయా అని విచారణ చేస్తున్నామన్నారు.

ఇతని వేలిముద్రలను సేకరించి అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు.

ప్రాపర్టీ కేసుల పై పకడ్బందీగా దర్యాప్తులు చేపడుతున్నామన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో కర్నూలు డిఎస్పీ గారితో పాటు కోడుమూరు సిఐ తబ్రేజ్ , సి. బెళగల్ ఎస్సై వేణుగోపాల్ రాజు , సిబ్బంది ఉన్నారు.

గూడూరు ఎస్సైగా హనుమంత రెడ్డి బాధ్యతల స్వీకరణ

కిరణ్ 24 x7 న్యూస్:
గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా హనుమంత రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గూడూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న చిరంజీవి కర్నూలు విఆర్ కు బదిలీ కాగా కోసిగి పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న హనుమంత రెడ్డి గూడూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం హనుమంత రెడ్డి గూడూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై హనుమంత రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపడతామని అదేవిధంగా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.  పట్టణంలో ట్రాఫిక్ కి అంతరాయం రాకుండగా ఆటోలు ద్విచక్ర వాహనాలు రహదారుల పై పెట్టకుండగా పోలీసులకు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

కిరణ్ 24 x7 న్యూస్ ; కర్నూలు జిల్లా గూడూరు మండలము, కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధి లో సోమవారం కుర్నూలు టు బళ్ళారి రోడ్డు లో ఎస్సార్ పెట్రోలో బుంకు సమీపంలో అనుమానాస్పద స్దితి లో రాత్రి సుమారు 09:30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తిని, గుర్తు తెలియని వాహనం డి కొనడం వలన రక్త గాయాలు కలిగి రోడ్డుపై పడి మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించి మృతదేహాన్ని కర్నూలు మార్చరికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి లేత గులాబీ రంగు టి షర్టు (పింకూ కలర్ ) మరియు నలుపు తెలుపు నీలువు గీతల పాయింటు ధరించి ఉన్నాడు, మరియ కుడిచేతిపైన హరిత లవ్ అనే సింబల్ పచ్చబొట్టు కలదు, సదరు వ్యక్తి పుట్టుమచ్చలు,కుడిపక్క ఎదపైన ఒక నల్లటి పుట్టుమచ్చ కలదు, మరియు ఎడమవైపు పొట్టపైన ఒక నల్లటి పుట్టుమచ్చ కలదు,కె.నాగలాపురం పోలీస్ వారు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీ నందు మృతదేహాన్ని భద్ర పరచడమైనది, కె.నాగలాపురం పోలీస్ వారు రక్తసంబంధీకులు ఎవరు రానందున వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనది. ఎవరైనా మృతుడి గురించి వివరాలు తెలిసిన యెడల, కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ కు తెలుపగలరు అని, K.నాగలాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆశలత ఫోన్ నెంబర్ 9121101068, మరియు కర్నూలు రూరల్ సీఐ చంద్ర బాబు నాయుడు,ఫోన్ నెంబర్ 9121101065, కు సమాచారం ఇవ్వవలసిందిగా తెలిపారు.

ఆరోగ్య శ్రీ క్రింద నగదు వసూలు చేస్తే చర్యలు తప్పవు….జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా.

కిరణ్ 24 x7 న్యూస్ ;

ఆరోగ్య శ్రీ క్రింద పేషెంట్ల నుండి నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను అదేశించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం అనేది నగదు రహితంగా నిర్వహించే పథకమని అందులో నగదు తీసుకోవడం ఏంటని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను కలెక్టర్ ప్రశ్నించారు?? ఆరోగ్య శ్రీ పథకంలో కవర్ కానీ చికిత్సలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం ఆసుపత్రి యాజమాన్యాలు నగదు తీసుకున్నారనే వివరాలను ఫిర్యాదు రూపంలో పేషంట్ల నుండి ఏ విధంగా తీసుకుంటారని కలెక్టర్ ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి డిఎంహెచ్ఓ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ నెలలో ఒకసారి సబ్ కమిటీ స్థాయి సమావేశం నిర్వహించుకొని ఫిర్యాదులపై వివరణ తీసుకోవాలని సదరు కమిటీ వివరణకు సంతృప్తి చెందకపోతే ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే జిల్లా స్థాయి కమిటీలో ఫిర్యాదును పరిశీలించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం ఉండగా ఎందుకు నగదు తీసుకుంటారని కలెక్టర్ ఆరా తీశారు.. పేషెంట్ వచ్చిన వెంటనే పలు పరీక్షల కోసం పేషెంట్ నుండి నగదును తీసుకోవడం జరుగుతుందని, తదనంతరం ఆరోగ్యశ్రీ లో నమోదు అయితే నగదును తిరిగి ఇవ్వడం జరుగుతుందని ఆసుపత్రి యాజమాన్యాలు కలెక్టర్ కి వివరించారు .. కలెక్టర్ స్పందిస్తూ అలా కాకుండా ముందుగా పరీక్షలు నిర్వహించి ఆ తరువాత పేషెంట్ ఆరోగ్య శ్రీ క్రింద వస్తే ఉచితంగా చికిత్స ఇవ్వాలని లేకపోతే అప్పుడు వారి నుండి నగదు తీసుకునే ప్రక్రియను అన్ని ఆసుపత్రులు పాటించాలన్నారు. జిల్లాలో వివిధ ఆసుపత్రులకు సంబంధించి ఇప్పటి వరకు 174 ఫిర్యాదులు రాగా అందులో 134 వరకు నగదును పేషంట్లకు ఆసుపత్రి యాజమాన్యాలు తిరిగి చెల్లించారన్నారు. ఆసుపత్రులు పేషంట్లకు నగదు తిరిగి చెల్లించే విధానానికి ఇప్పటి నుంచి అయిన స్వస్తి పలకాలని కలెక్టర్ ఆసుపత్రి యాజమాన్యాలకు సూచించారు.

ఆసుపత్రుల ఫిర్యాదులను కేసు వారీగా రివ్యూ చేస్తూ పెండింగ్ ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ నుంచి తొలగించిన ఆసుపత్రులపై ఏమైన కేసులు ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

సమావేశంలో ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.ఎంవిఎన్ఎస్వి.భాస్కర్ రెడ్డి, ఇంఛార్జి డిఎంహెచ్ఓ ఎల్.భాస్కర్, ఇంఛార్జి డిసిహెచ్ఎస్ డా.రామకృష్ణ, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సరఫరా లో మార్పులు… ట్రాన్స్కో ఏఈ

కిరణ్ 24×7 న్యూస్;
కర్నూలు నుండి గూడూరు ట్రాన్స్కో సబ్స్టేషన్ కు వచ్చే 132 కె.వి లైన్ సామర్థ్యం పెంపు కొరకు కండక్టర్ /వైర్ మార్పు పనులు జరుగుతునందున గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని అగ్రికల్చర్ ఫీడర్లకు 3-ఫేజ్ సప్లై (వ్యవసాయ బావులకు/బోరులకు, పంచాయితీ నీటి సరఫరా కొరకు) వేళల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లుగా గూడూరు సబ్ డివిజన్ ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ నాయక్ తెలియజేశారు.
గ్రూప్- ఏ టైమింగ్ :
ఉదయం 05:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00గంటల వరకు
మరియు
రాత్రి 9:00గంటల నుండి 11:00 గంటల వరకు
గ్రూప్- బి టైమింగ్ :
రాత్రి 03:00 గంటల నుండి 05:00గంటల వరకు
మరియు మధ్యాహ్నం 12:00గంటల నుండి సాయంత్రం 07:00గంటల వరకు ఇవ్వడం జరుతుంది. ఈ విషయాన్ని గమనించి రైతులు,ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు సహకరించాలని కోరుతున్నాము.

గోవులను విక్రయిస్తే చర్యలు తప్పవు …గూడూరు ఎస్సై.

గూడూరు, జూన్ 14,( కిరణ్24×7న్యూస్)
బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను విక్రయించిన కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని గూడూరు ఎస్సై హనుమంతయ్య హెచ్చరించారు . శుక్రవారం గూడూరు పట్టణంలో జరిగే వారపు సంతను  ఎస్సై హనుమంతయ్య మరియు సిబ్బంది కలిసి  మార్కెట్లో పర్యటించారు. పశువులను విక్రయించే వ్యాపారులకు కొనుగోలు చేసే వారికి బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను విక్రయించరాదని అలా విక్రయించిన కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణంలోని రహదారికి నలువైపులా చెక్పోస్టులను ఏర్పాటు చేసి గోవులను అక్రమంగా తరలించకుండా పోలీసులతో నిఘాను ఏర్పాటు చేశారు. సంత మార్కెట్ నిర్వాహకులకు మరియు పశువులు అమ్మే వ్యాపారస్తులకు, దళాలీలకు నోటీసులు అందజేశారు.

15 మంది మునగాల… గ్రామ వాలంటీర్లు రాజీనామ.

 kiran24×7news ;

కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం మునగాల గ్రామంలో
వాలంటీర్లుగా పనిచేయుచున్న 15 మంది గ్రామ వాలంటీర్లు స్వచ్ఛందంగా విధులకు రాజీనామా చేసి M.P.D.O జయశ్రీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. మరి కొంతమంది వాలంటీర్లు కూడా రాజీనామా చేసి తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో గారికి త్వరలోనే అందజేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. గూడూరు మండలంలోని వాలంటీర్లు చాలావరకు తమ విధులకు స్వచ్ఛతంగా రాజీనామా చేసి తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో గారికి గత వారం రోజులుగా అందజేస్తూ వస్తున్నారు.

కోడుమూరులో గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు…

kiran24×7news ;

కోడుమూరు పట్టణంలోని చిన్న బోయ వీధిలో ఆకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలి ఇంటిలో ఉన్న రవి అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి.

రెండు గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పెళ్లి పెద్ద శబ్దం రావడంతో పేలుడు శబ్దానికి చుట్టూ ప్రక్కల ఇళ్లవారు ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు. వెంటనే ఇంటి వద్దకు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఇంటి యజమాని రవి మాత్రమే ఉంది భార్యా పిల్లలు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇల్లు  తీవ్ర ప్రమాదానికి గురై నష్టం వాటిల్లింది. సకాలంలో అక్కడికి వచ్చి వచ్చిన కాలనీ ప్రజలు ప్రమాదం కు గురైన ఇంటి నుండి రవీని బయటకు తీసుకువచ్చి  అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇచ్చారు. ఇంటి యజమాని రవి భార్య సుజాత, పిల్లలు ఊరికి వెళ్ళటం తో రవి మాత్రమే ప్రమాదం కు గురి కావటం జరిగింది.

గూడూరులో టిడిపి ప్రభంజనం …వెల్లువెత్తిన ప్రజాభిమానం.

kiran24×7news ;
ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్డు షోకు ప్రజలు అభిమానులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. గూడూరు పట్టణంలోని బస్టాండ్ కు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు రోడ్ షోకు వేలాదిగా టిడిపి పార్టీ శ్రేణులు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచిన కోడుమూరు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని, ప్రజలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవ చేశారు.

నియోజకవర్గంలో ప్రజలు త్రాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్న వైకాపా నేతలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని వైసిపి పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమకు అఖండ విజయం అందించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.

రాష్ట్ర అభివృద్ధి టిడిపి పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి అఖండం మెజార్టీని అందించాలని ఓటర్లను ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ఈసారి కోడుమూరు నియోజకవర్గం లో అఖండ విజయం సాధించి చరిత్ర తిరగరాస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గూడూరు మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు తెలుగు శీను రేమట వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు సుందరరాజు సృజన్ పౌలు కౌన్సిలర్లు బుడంకాలి  నాయకులు కూరగాయల చాంద్ నాగప్ప యాదవ్ మన్నన్ భాష పెంచగల పాడు కృష్ణ కే నాగలాపురం సురేష్ మరియు కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు బెలగల్ కర్నూలు రూరల్ మండలంలోని టిడిపి జనసేన బిజెపి నాయకులు నేతలు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

టిడిపి నుండి వైసిపి లోకి జోరుగా కొనసాగుతున్న వలసలు..

kiran24×7news ;

పొలకల్ గ్రామానికి చెందిన టిడిపి 100 కుటుంబాలు వైసిపి పార్టీలోకి పొలకల్ యూత్ నాయకుడు రాజేష్ గారి ఆధ్వర్యంలో ఎల్లప్ప, వెంకటేష్, దేవరాజు, ఆనంద్, ప్రభాకర్, గిరి, గంగన్న, లక్ష్మన్న, ఏలోజి, బోయాజు, నడిపి ఆయన్న, మహేష్, శంకర్, థామస్, చక్రవల్లి, బోజన్న, రామకృష్ణ, కుమార్, చిన్నారాజు, శ్యామరాజు, చిలక, ఏసేపు, సుంకన్న, రాముడు, స్వామిదాసు, ప్రతాప్ లు చేరారు..

వీరిని కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

జనసేన పార్టీని విడి వైసీపీ పార్టీలోకి భారీగా చేరిన నాయకులు….

ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 500 మంది జనసేన పార్టీ నాయకులు వైసిపి పార్టీలోకి మూల్ల మహబూబ్ బాషా, సి.బెళగల్ కన్వీనర్ శేఖర్ రెడ్డి, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎస్.ఎం.బాషా, టిజి వెంకటేష్, వార్డు మెంబర్ ఫారూఖ్, కో అప్షన్ సభ్యులు హారున్ గార్ల ఆధ్వర్యంలో చేరారు..

వీరికి కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు..

ఈ కార్యక్రమంలో అహ్మద్ హుసేన్, ఉమర్ పరూఖ్, హుస్సేన్, రహిమాన్ భాషా, ఇబ్రహీం, రఫీ, మౌలాలి, రఫీ, అలీ, షాషావలి, షఫీ, ఇస్మాయిల్ లతోపాటు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు,

 

గుడిపాడు వాలంటీర్ల రాజీనామా..

kiran24×7news ;

గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వాలంటీర్లు స్వచ్ఛందంగా శనివారం తమ విధులకు రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు.. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను వాలంటీర్లు గూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జయశ్రీ కి అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ తాము విధులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా తెలుపుతూ ..మరి కొంతమంది వాలంటీర్లు కూడా త్వరలోనే తమ విధులకు రాజీనామా చేస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

kiran24×7news ;
సెబ్ ఎక్స్ ఆఫీషియో అడిషనల్ డైరెక్టర్ అయిన కర్నూల్ జిల్లా SP శ్రీ జి.కృష్ణకాంత్, IPS, జిల్లా SEB స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ నాగరాజు, వారి నిరంతర ఆదేశాల మేరకు…. కర్నూల్ SEB ఎన్ఫోర్స్మెంట్ సూపర్ఇంటెండెంట్ శ్రీ రవికుమార్ వారి పర్యవేక్షణలో….

ఈదినం Dt.27.04.2024 ఆలూరు SEB స్టేషన్ పరిధిలోని ఆస్పరి మండలం, యాటకల్ నుండి తోగరగల్లు వెళ్ళు బండి రస్తాలో గల వంక వద్ద కర్నూల్ జిల్లా DTF ఇన్స్పెక్టర్ E.నరసానాయుడు మరియు వారి సిబ్బంది, BMPP ఎమ్మిగనూరు సిబ్బంది రాబడిన సమాచారం మేరకు వాహనాలను తనిఖి చేయుచుండగా BOLERO PICK UP FB 1.7L వాహనంలో కర్ణాటక రాష్ట్రంకు చెందిన మద్యం బాక్సులు తరలిస్తుండగా అందులో ఉన్న K.మంజునాథ, s/o చిన్నకొటప్ప R/o హొలగుంద village and Mandal. అను వ్యక్తిని అరెస్టు చేయగా రెండవ వ్యక్తి డ్రైవర్ తౌసీఫ్@ సమూద్ R/o హొలగుంద village and Mandal అను వ్యక్తి పారిపోవడం జరిగింది. BOLERO PICK UP లో trolly లొ వున్న కర్నాటక మద్యం బాక్సులును లెక్కించగా అవి 80 బాక్సులులు గా వుండబడి, ఒక్కొక బాక్స్ నందు 96 (90ML) original choice deluxe whiksky tetrapockets ఉండి అవి మొత్తం 7680 tetrapockets ఉండి సుమారు 691 లీటర్లు ఉన్న ఈ మధ్యం విలువ రూ.4,84,000/- గా ఉంది. వాహనం యొక్క విలువ సుమారు 8 లక్షల రూపాయలు. మధ్యం మరియు వాహనం రెండింటి విలువ సుమారు 12,84,౦౦౦ రూపాయలు. మధ్యం మరియు వాహనంను సీజ్ చేసి ఆలూర్ SEB స్టేషన్ కి తరలించడం జరిగింది. మధ్యాన్ని కెమికల్ పరీక్షల కొరకు సాంపిల్స్ తీసి, ముద్దాయి మంజునాథను రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇంకా ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడానికి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీ నాగరాజు గారు కర్నూల్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ మరియు డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెండు టీములను ఏర్పాటు చేశారు. ఈ దాడులలో పాల్గొన్నవారు SI వీరాస్వామి, HC లు వెంకటరాముడు, రాముడు, EC లు షెక్షవలి, నాగరాజు, బషీర్ మరియు కరుణాకర్ పాల్గొన్నారు.

వర్కుర్ గ్రామ ముస్లింలు వైఎస్సార్ సిపి పార్టీలో చేరిక…

kiran24×7news ;

కోడుమూరు మండలం వర్కుర్ గ్రామానికి చెందిన ముస్లిం పెద్దలు, ముస్లిం నాయకులు వైసిపి పార్టీలోకి కృష్ణారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సోమశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరారు..

వీరికి కుడా చైర్మన్, కోడుమూరు సమన్వయ కర్త శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గార్లు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు..

ఈ కార్యక్రమంలో రఫీ, సుభాన్, రఫీ, ఉస్మాన్, మహబూబ్ బాషా, మాక్బుల్, షేక్ శవాలి, హుస్సేని, ఖజా హుస్సేన్, రెడ్డి విన్నల, రెడ్డి రఫీ, రెడ్డి ఆధులషన్, రెడ్డి రజాక్ మియా, మూళ్ళ హుస్సేన్, షేక్ శవాలి, కటికె నాభిసా, మహ్మద్ కటికె, మసుం కటికె, మాక్బుల్, గౌస్ మోదీన్, అలీ బాషా, సుభాన్, అమీర్ భాష, మినల్ల హుస్సేని, తదితరులు పార్టీలోకి చేరారు